కమల విలాపం.. జార్ఖండ్ ఎన్నికలు నేర్పిన పాఠాలేంటి ?

కమల విలాపం.. జార్ఖండ్ ఎన్నికలు నేర్పిన పాఠాలేంటి ?
x
కమల విలాపం.. జార్ఖండ్ ఎన్నికలు నేర్పిన పాఠాలేంటి ?
Highlights

దేశంలో బీజేపీ బలం తగ్గిపోతున్నదా ? తాజాగా జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే ఇదే సందేహం కలుగుతోంది. ఓ రెండేళ్ళ క్రితం దేశపటంలో ఎన్నో రాష్ట్రాలు...

దేశంలో బీజేపీ బలం తగ్గిపోతున్నదా ? తాజాగా జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే ఇదే సందేహం కలుగుతోంది. ఓ రెండేళ్ళ క్రితం దేశపటంలో ఎన్నో రాష్ట్రాలు కాషాయవర్ణంతో కనిపించాయి. ఇప్పడు మాత్రం అలాంటి పరిస్థితిలేదు. ఒక్కో రాష్ట్రం బీజేపీ చేజారుతోంది. దీంతో ఎందుకిలా జరుగుతోందన్న ఆత్మవిమర్శలో పడిపోయింది బీజేపీ.

రెండేళ్ళ క్రితం దాకా దేశ భూభాగంలో 71 శాతం బీజేపీ, దాని మిత్రపక్షాల పాలనలో ఉండింది. ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదు. 2014 దాకా 7 రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉండిన బీజేపీ 2018లో మోడీ వేవ్ తో 21 రాష్ట్రాల్లో అధికారం పొందగలిగింది. 2014లో బీజేపీ గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్, గోవా, అరుణాలచల్ ప్రదేశ్ లలో అధికారంలో ఉండింది. 2018 నాటికి పరిస్థితి మారిపోయింది. తమిళనాడు, కేరళ, కర్నాటక, మిజోరం, పంజాబ్, ఒడిషా, బెంగాల్, తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాలూ బీజేపీ లేదంటే బీజేపీ కూటమి గుప్పిట్లోకి వచ్చాయి.

2014లో బీజేపీ కూటమి 7 రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంటే, 2015 నాటికి ఆ సంఖ్య 13కు పెరిగింది. 2016లో 15కు చేరుకుంది. 2017లో 19కి పెరిగింది. 2018లో 21కి చేరుకుంది. ఆ తరువాత మాత్రం పతనం ప్రారంభమైంది. మిజోరం వంటి ఊహించని ప్రాంతాల్లోనూ బీజేపీ గెలిచినా, కంచుకోటల్లాంటి మధ్యప్రదేశ్, రాజస్థాన‌, చత్తీస్ గఢ్ లను చేజార్చుకుంది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ఎన్డీయే కూటమి నుంచి వైదొలిగింది. జమ్మూ కశ్మీర్ లో రాష్ట్రపతి పాలన వచ్చింది. ఆ తరువాత మరిన్ని రాష్ట్రాలు బీజేపీ చేజారిపోయాయి.

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. రాష్ట్రాల్లో మాత్రం బీజేపీ అగ్నిపరీక్షనే ఎదుర్కొంది. కర్నాటకలో ఎలాగోలా బీజేపీ అధికారం నిలబెట్టుకున్నప్పటికీ, మహారాష్ట్రలో పరిస్థితి చేజారిపోయింది. బీజేపీ కూటమి పాలిత రాష్ట్రాల సంఖ్య 17కు తగ్గిపోయింది. చిన్న చిన్న రాష్ట్రాల్లో బీజేపీ గెలిచినా పెద్ద రాష్ట్రాల్లో మాత్రం ఓటమి చవిచూసింది. 2017లో దేశ భూభాగంలో 71 శాతం లో ఏదో విధంగా బీజేపీ పాలన కొనసాగింది. మహారాష్ట్ర చేజారడంతో అది 40 శాతానికి తగ్గిపోయింది. తాజాగా జార్ఖండ్ కూడా కాంగ్రెస్ ఖాతాలో చేరిపోయింది. దీంతో బీజేపీ పాలిత భూభాగం గ్రాఫ్ మరింత పడిపోయింది. కర్ణుడి చావుకు కారణాలు ఎన్నో అన్నట్లుగా వివిధ రాష్ట్రాల్లో బీజేపీ హవా తగ్గిపోవడానికి ఎన్నో కారణాలున్నాయి. వాటిలో ముఖ్యమైంది లోకలైజేషన్. వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో స్థానిక అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం బీజేపీ కూటమి నుంచి వైదొలిగేందుకు కూడా స్థానిక అంశాలే కారణమయ్యాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories