దిల్లీ కొత్త సీఎం ఎవరు?: రేసులో వీరే...

దిల్లీ కొత్త సీఎం ఎవరు?: రేసులో వీరే...
x
Highlights

దిల్లీకి కొత్త ముఖ్యమంత్రి ఎవరో ఇంకా నిర్ణయించలేదు. అమెరికా పర్యటన నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండియా తిరిగి వచ్చిన తర్వాత కొత్త ముఖ్యమంత్రిని ఫైనల్ చేస్తారు.

దిల్లీకి కొత్త ముఖ్యమంత్రి ఎవరో ఇంకా నిర్ణయించలేదు. అమెరికా పర్యటన నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండియా తిరిగి వచ్చిన తర్వాత కొత్త ముఖ్యమంత్రిని ఫైనల్ చేస్తారు. ముఖ్యమంత్రి పదవి కోసం పలువురి పేర్లు ప్రచారంలో వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 19 లేదా 20 తేదీల్లో కొత్త సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండే అవకాశం ఉందని సమాచారం.

ఫ్రాన్స్ , అమెరికా పర్యటన నుంచి మోదీ ఇండియాకు తిరుగు పయనమయ్యారు. ఆయన ఇండియాకు రాగానే దిల్లీ కొత్త సీఎం ఎంపికపై చర్చించనున్నారు. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ 48 స్థానాల్లో గెలిచింది. ఆప్ కేవలం 22 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ ఒక్క సీట్లో గెలవలేదు. కానీ, ఆ పార్టీ చీల్చిన ఓట్లు పరోక్షంగా బీజేపీ గెలుపునకు కారణమయ్యాయి.

దిల్లీ ముఖ్యమంత్రి పదవి రేసులో 15 మంది పేర్లను షార్ట్ లిస్ట్ చేశారు. ఈ 15 మందిలో సీఎంతో పాటు మంత్రి పదవిని ఎంపిక చేయనున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేశ్ వర్మ పేరు సీఎం రేసులో ముందు వరుసలో ఉన్నారు. వర్మతో పాటు ఆశిష్ సూద్, సతీశ్ ఉపాధ్యాయ్, విజయేందర్ గుప్తా వంటి పేర్లు సీఎం రేసులో వినిపిస్తున్నాయి.

పార్టీ సీనియర్ నాయకురాలు రేఖా గుప్తా పేరు కూడా మహిళా కోటాలో సీఎం పదవికి రేసులో అగ్రస్థానంలో వినిపిస్తోంది. ఆమె ఏబీవీపీలో పనిచేశారు. ఆమె బీజేవైఎం దిల్లీ సెక్రటరీగా పనిచేశారు. ఆమె కౌన్సిలర్ గా కూడా గతంలో ఎన్నికయ్యారు. శిఖా రాయ్ గ్రేటర్ కైలాస్ మున్సిపాలిటీలో ఆమె రెండుసార్లు కౌన్సిలర్ గా పనిచేశారు. సీఎం పదవి రేసులో ఆమె పేరు వినిపిస్తోంది. సతీశ్ ఉపాధ్యాయ్ బీజేపీ దిల్లీ కమిటీ మాజీ అధ్యక్షుడి పేరు కూడా సీఎం రేసులో వినిపిస్తోంది. న్యూదిల్లీ మున్సిపల్ కౌన్సిల్ వైఎస్ చైర్మన్ గా కూడా ఆయన పనిచేశారు.

సీఎం పదవికి అభ్యర్థి ఎంపిక విషయంలో సామాజిక సమీకరణాలు, పార్టీకి చేసిన సేవను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. పంజాబీ లేదా జాట్ సామాజిక వర్గానికి చెందిన వారిని సీఎం పదవికి ఎంపిక చేయాలనే చర్చ కూడా పార్టీలో ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories