ఇవాళ ఇండియాకు డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ గెబ్రేయేసస్...

WHO Chief - India Tour: గుజరాత్‌లో 3 రోజుల పాటు పర్యటన...

Shireesha
Updated on: 18 April 2022 7:54 AM IST
WHO Chief Tedros Adhanom Ghebreyesus India Tour Today 18 04 2022 | Live News Today
X

ఇవాళ ఇండియాకు డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ గెబ్రేయేసస్...

WHO Chief - India Tour: వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO) డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ గెబ్రేయేసస్(Tedros Adhanom Ghebreyesus) ఇవాళ ఇండియాకు రానున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన గుజరాత్‌(Gujarat) లో పర్యటించనున్నారు. ఇవాళ రాజ్‌కోట్ చేరుకొని అక్కడే ఉంటారు. మంగళవారం ప్రధాని మోడీతో కలిసి జామ్‌నగర్‌లో డబ్ల్యూహెచ్‌వో గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్‌కు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారని రాజ్‌కోట్ కలెక్టర్ తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా సాంప్రదాయ వైద్యం కోసం జీసీటీఎం మొదటి, ఏకైక గ్లోబల్ అవుట్‌పోస్ట్ కేంద్రంగా ఉంటుందని చెప్పారు. తర్వాత బుధవారం గాంధీనగర్‌లో మహాత్మామందిర్‌లో గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్‌మెంట్, ఇన్నోవేషన్ సదస్సును ప్రధాని మోడీ(PM Modi) తో కలిసి టెడ్రోస్ పాల్గొననున్నారు.

Shireesha

Shireesha

Next Story