New Income Tax Bill: కొత్త ఇన్‌కమ్‌ ట్యాక్స్ బిల్లులో ఏముంటుంది? పాతదానికి, కొత్తదానికి తేడా ఏంటి?

New Income Tax Bill: కొత్త ఇన్‌కమ్‌ ట్యాక్స్ బిల్లులో ఏముంటుంది? పాతదానికి, కొత్తదానికి తేడా ఏంటి?
x
Highlights

Union Budget 2025: మోదీ సర్కారు వచ్చే వారం కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఫిబ్రవరి 1న కొత్త బడ్జెట్...

Union Budget 2025: మోదీ సర్కారు వచ్చే వారం కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఫిబ్రవరి 1న కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని చెప్పారు. దీంతో అప్పటి నుండి దేశంలో అందరి దృష్టి రాబోయే ఈ ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లుపైనే ఉంది.

ఇంతకీ ఈ కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం ఎందుకు తీసుకొస్తున్నట్లు? ఇప్పటివరకు ఉన్న పాత చట్టానికి, కొత్తగా తీసుకురాబోయే చట్టానికి ఏం తేడా ఉండనుంది? ఎలాగూ 12 లక్షల ఆదాయం వరకు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని చెప్పిన కేంద్రం.. కొత్తగా మరో ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు ఎందుకు తెస్తున్నట్లు? ఈ సందేహాలే ఇప్పుడు చాలామందిని వేధిస్తున్నాయి. ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడమే ఈ వీడియో లక్ష్యం. ఛలో.. మరి ఇంకెందుకు ఆలస్యం.. జనంలో చాలా మందికి ఉన్న ఆ కన్‌ఫ్యూషన్స్‌ను తొలగిద్దాం రండి.

యస్ దేశంలో ప్రస్తుతం మనం చూస్తోన్న ఈ ఇన్‌కమ్ ట్యాక్స్ విధానం ఇప్పటికి కాదు. 60 ఏళ్ల కింద... అంటే, 1961 లో రూపొందించిన ఇన్‌కమ్ చట్టానికి మధ్యమధ్యలో ప్రభుత్వాలు కొన్ని సవరణలు చేస్తూ వచ్చాయి. అలా సవరణలు చేస్తూ.. చేస్తూ.. రావడం వల్ల ఇందులో ఎన్నో మార్పులు జరిగాయి. ఆ మార్పులు చివరకు ఎక్కడి వరకు వెళ్లాయంటే... ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టే వారికి తాము ఏ పన్ను ఎందుకు కడుతున్నామో.. ఏ పన్ను మినహాయింపు చట్టాన్ని ఎలా వాడుకోవాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.

ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైలింగ్ ఎలా చేయాలి? ఏం చేస్తే పన్ను మినహాయింపు బెనిఫిట్స్ తీసుకోవచ్చు? ప్రభుత్వం ఏ లిటిగేషన్ ఎందుకు పెడుతోంది? అనే విషయాలు తెలియకుండానే టాక్స్ కడుతున్న వాళ్లు ఇండియాలో ఇప్పటికీ చాలామందే ఉన్నారు. అందుకే వారికి ఇన్‌కమ్ ట్యాక్స్ అనే మాటెత్తితేనే పెద్ద చిరాకు.

ఒక్కముక్కలో చెప్పాలంటే... ఏడాదంతా చాకిరి చేయడం... ఏడాది చివర్లో ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టడం తప్పితే... అంతకు మించి ఇంకేమీ చేయలేని నిస్సహాయ స్థితి. తాము కష్టపడి సంపాదించుకున్నదాన్ని టాక్స్ రూపంలో పోగొట్టుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? భవిష్యత్ కోసం నిజాయితీగా నాలుగు రాళ్లు వెనకేసుకునే మార్గం ఏదైనా ఉందా? అనే ప్రశ్నలకు మన దేశంలో టాక్స్ కట్టే వారిలో చాలామంది దగ్గర సమాధానం లేదు. ప్రస్తుత ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం అంత క్లిష్టంగా.. ఒక అర్థం కాని బ్రహ్మ పదార్థంలా తయారైంది.

అయితే, ఆ సమస్యకు చెక్ పెట్టేందుకే ఇప్పుడు కేంద్రం నడుం బిగించింది. ఇప్పుడున్న ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం స్థానంలో ఎలాంటి అరమరికలు లేకుండా... అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినంత సింపుల్‌గా ఎవ్వరైనా చట్టాన్ని అర్థం చేసుకునేలా చేయాలనేది తమ లక్ష్యం అని కేంద్రం చెబుతోంది. అందులో భాగంగానే ఈ కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లును ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది.

నిర్మలా సీతారామన్ ఏం చెబుతున్నారంటే..

కొత్త చట్టం గురించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సింపుల్‌గా సమాధానం చెప్పేశారు. ఇప్పుడున్న ఇన్‌కమ్‌ ట్యాక్స్ చట్టంలోని గందరగోళాలన్నీ పోయేలా కొత్త చట్టం వస్తుందన్నారు. ఇప్పుడున్న చట్టంతో పోల్చుకుంటే రాబోయే చట్టాన్ని సగం వరకు కుదించి అందరికీ ఈజీగా అర్థమయ్యేలా సింప్లిఫై చేస్తున్నామన్నారు. అంతే కాదు... కొత్త చట్టం పన్ను చెల్లింపుదారులకు న్యాయం చేసేలా, పారదర్శకంగా ఉంటుందని చెప్పారు.

సరళమైన భాషలో కొత్త చట్టం

ఫస్ట్ పోస్ట్ వార్తా కథనం ప్రకారం... ఇప్పటి వరకూ ఉన్న చట్టంలో సామాన్యులకు అర్థం కానీ గజిబిజి పదాలు ఎన్నో ఉన్నాయని కేంద్రం గుర్తించింది. ఇకపై ఆ క్లిష్టమైన భాషను సరళమైన పద్ధతిలోకి మార్చుతున్నట్లు కేంద్రం చెబుతోంది.

టాక్స్ కట్టే ప్రక్రియలో డాక్యుమెంటేషన్ ప్రాసెస్ పెద్ద తలనొప్పి పని. అర్థం కాని భాషలో ఆ పేపర్, ఈ పేపర్ అని సావగొట్టి చెవులు మూస్తరనుకో. అందుకే టాక్స్ పేయర్స్‌లో చాలామంది టాక్స్ ఫైలింగ్ కోసం ఛార్టర్డ్ అకౌంటెంట్ ఏజెన్సీలు, లేదా టాక్స్ ఫైలింగ్ కన్సల్టెన్సీలపైనే ఆధారపడ్డం తెలిసిందే.

అందుకే టాక్స్ పేయర్స్ బాధ ఎలా ఉంటుందంటే... టాక్స్ కట్టడంతోనే జేబుకు పెద్ద చిల్లుర బాబూ అనుకుంటే... ఫైలింగ్ చార్జెస్ రూపంలో మళ్ల ఇంకో చిల్లు పడిందే అన్న బాధ. అందుకే ఇకపై ఆ పని కూడా ఈజీ చేస్తాం అంటోంది కేంద్రం.

వాస్తవానికి 2009లోనే అప్పటి యూపీఏ ప్రభుత్వం ఈ ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం రూపురేఖలు మార్చి సింప్లిఫై చేసేందుకు ప్రయత్నించింది. కానీ రకరకాల కారణాలతో అది సాధ్యపడలేదు.

2018 లో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం తయారు చేసేందుకు ఒక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. కానీ ఇప్పటివరకు అది కూడా ముందడుగు పడలేదు.

అయితే ఆ రెండు సందర్భాల్లో ప్రభుత్వం ముందుకొచ్చిన సలహాలు, సూచనలను ఇప్పుడు ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటోంది.

టాక్స్ పేయర్స్‌లో 'రెసిడెన్షియల్ స్టేటస్' తికమక

టాక్స్ కట్టేవారిని వారి రెసిడెన్షియల్ స్టేటస్ ఆధారంగా ప్రభుత్వం మూడు రకాలుగా విభజించింది. అందులో మొదటి రకం రెసిడెంట్ ఇండివిజువల్ స్టేటస్ అంటారు.

రెండో రకంను రెసిడెంట్ ఇండివిజువల్ బట్ నాట్ ఆర్డినరీ ఇండివిజువల్ అని అంటారు. ఇక మూడో రకం నాన్ రెసిడెంట్ ఇండివిజువల్.

ఈ మూడు రకాల్లో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన టాక్స్ రూల్స్ ఉంటాయి. ఎవరికి ఏది వర్తిస్తుందనేది టాక్స్ కట్టే వారికే అర్థం కాని విషయం. కొత్తగా తీసుకురానున్న ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం ఈ గందరగోళాన్ని కూడా తొలగించనుంది.

అనవసర మినహాయింపులకు ఇక నో ఛాన్స్ అంటోన్న కేంద్రం

అనవసర మినహాయింపులకు కేంద్రం ఇక నో ఛాన్స్ అంటోంది. ఔను.. ముందుగా చెప్పుకున్నట్లుగా ఈ 64 ఏళ్ల కాలంలో ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టంలో ఎన్నో సవరణలు వచ్చాయి. ప్రభుత్వంపై టాక్స్ పేయర్స్‌కు కోపమొచ్చిన ప్రతీసారి ఆ కోపాన్ని చల్లార్చడం కోసం అప్పుడప్పుడు టాక్స్ సేవింగ్ పేరుతో రకరకాల మినహాయింపులు జోడిస్తూ వెళ్లారు. అవి కూడా ఇంకొంత గందరగోళానికి దారితీసాయి.

అందుకే ఇప్పుడు ప్రభుత్వం అందులో కొన్ని మినహాయింపులు అనవసరం అని భావిస్తూ వాటిని పక్కన పెట్టేసేందుకు రెడీ అయ్యింది. అయితే, వీటిలో ఏవీ కొనసాగిస్తారు, వేటిని ఆపేస్తారు అనేది కొత్త చట్టం వస్తే కానీ తెలిసే ఛాన్స్ లేదు.

ఇక ప్రస్తుతం బిల్లు స్టేటస్ ఏంటనే విషయానికొస్తే.. కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లును పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ క్షుణ్ణంగా రివ్యూ చేస్తోంది. ఆ పరిశీలన పూర్తయితే... అవసరమైన చోట సవరణలు సూచిస్తుంది. అవి పూర్తి అయిన తరువాత పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. మొదట లోక్ సభలో, ఆ తరువాత రాజ్యసభలో ఆమోదం పొందిన తరువాత రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిస్తారు. అక్కడ కూడా ఆమోదం వచ్చిన తరువాత ఆ బిల్లు చట్టం రూపంలోకి వస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories