ప్రస్తుతం షిర్డీ వివాదం వెనుక కారణాలు ఎంటి ?

ప్రస్తుతం  షిర్డీ  వివాదం వెనుక కారణాలు ఎంటి ?
x
SaiBaba
Highlights

సాయిబాబా జన్మస్థలంపై వివాదం చెలరేగింది. అసలు ఈ వివాదాని కారణం ఎంటి? అనేది అందరి మదిలో నిలిచిన ప్రశ్న

సాయిబాబా జన్మస్థలంపై వివాదం చెలరేగింది. అసలు ఈ వివాదాని కారణం ఎంటి? అనేది అందరి మదిలో నిలిచిన ప్రశ్న. అసలు వివాదం ఇక్కడి నుంచే మొదలయింది. షిర్డీ సాయి బాబా జన్మ స్థలంపై ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. బాబా జన్మస్థలం ఎక్కడ అనేది ఎవరికి పూర్తిగా తెలియదు. బాబా జన్మించిన ప్రాంతం పాథ్రీ అని ఆ గ్రామంలో పుట్టాడని మహారాష్ట్ర సర్కార్‌ కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. బాబా జన్మించిన గ్రామానికి 100 కోట్లు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ప్రకటనపై వివాదాస్పదం అయింది.

సాయి బాబా జన్మస్థలం ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ప్రకటనపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. శివసేన,ఎన్సీపీ, కాంగ్రెస్‌ సర్కార్ సాయి బాబా జన్మస్థలాన్ని కావాలనే వివాదాల్లోకి లాగుతోందని విమర్శిచింది. ఈ నేపథ్యంలో అహ్మద్‌నగర్‌ ఎంపీ సుజయ్‌ విఖే పాటిల్‌ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. సాయిబాబా జన్మ స్థలం విషయంలో రాజకీయ జోక్యం ఆపాలని, లేదంటే షిర్డీ ప్రజలు న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. అయితే ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ప్రకటనతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరుపై షిర్డి ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వం కావాలనే షిర్డీలో వివాదాలు సృష్టింస్తుందని ఆరోపిస్తున్నారు. దీంతో గ్రామస్తులు షిర్డీ బంద్‌కు పిలుపునిచ్చారు

ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ప్రకటనతో షిర్డి బంద్ కు పిలుపునివ్వడంతో ఆలయం మూసివేస్తున్నారని వార్తలు గుప్పుమన్నాయి. షిర్డీ దీంతో ఆలయ ట్రస్ట్‌ స్పందించింది. బంద్ కు ట్రాస్ట్ కు సంబంధం లేదని ప్రకటించింది. సాయిబాబా మందిరం తెరచివుంటుందని తెలిపింది. భక్తులు ఆందోళన గురికావద్దని పేర్కొంది. భక్తి నివాస్ లో సేవలు కొనసాగుతాయని సాయిబాబా సంస్థాన్ ట్రాస్ట్ అధికారి మోహన్ యాదవ్ వెల్లడించారు.

షిర్డి అసలు వివాదం ఇక్కడి నుంచే మొదలయింది. పాథ్రీని సాయిబాబా జన్మస్థలంగా అభివృద్ధి చేస్తామన్న సీఎం ఉద్దవ్‌ఠాక్రే ప్రకటనపై షిరిడీ గ్రామస్థులు మండిపడింది. నిరసనగా రేపటి నుంచి షిరిడీలోని సాయిబాబా ఆలయాన్ని నిరవధికంగా మూసివేయాలని డిమాండ్ చేశారు. 1854లో అంటే 16 ఏళ్ల వయస్సులో సాయి షిరిడీకి వచ్చారని తొలుత ఓ వేపచెట్టుకింద సాయి బాబా కనిపించారని, షిరిడీకి 275 కిలోమీటర్ల దూరంలో పర్బాని జిల్లాలో పాథ్రీ అనే ఊరిలో సాయిబాబా జన్మించారని మహారాష్ట్ర సర్కార్‌ చెబుతోందిప్పుడు. అయితే ఆయన అసలు పేరు కూడా ఎవరికి తెలియదట. దీనితో ఖండోబా పూజారి ఒకరు సాయి అని నామకరణం చేసినట్టు చరిత్రలో ఉంది.

షిరిడీ సాయిబాబా కర్మభూమి అయితే పాథ్రీ జన్మభూమి అంటున్నారు. కాగా, బీజేపీ నేతలు మాత్రం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ఈ వివాదం రాజుకుందని ఆలయాన్ని షిర్డీ నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇటు శివసేన మంత్రులు మాత్రం ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయిస్తే ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. పత్రీయే సాయినాథుని జన్మస్థలమనే విషయాన్ని గతంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ కూడా సమ్మతించారని చెబుతున్నారు. షిరిడీ సాయిబాబా కర్మభూమి అయితే పత్రి జన్మభూమి అని స్పస్టం చేస్తున్నారు. మరి రేపటి లోపు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories