Shirdi Sai Baba: ఇంతకీ సాయిబాబాది షిరిడీనా... పాథ్రీనా.. సాయి భక్తులకు షాక్‌ ఇచ్చింది ఎవరు?

Shirdi Sai Baba: ఇంతకీ సాయిబాబాది షిరిడీనా... పాథ్రీనా.. సాయి భక్తులకు షాక్‌ ఇచ్చింది ఎవరు?
x
సాయి భక్తులకు షాక్‌ ఇచ్చింది ఎవరు?
Highlights

కర్మభూమి జన్మభూమి. ఇదిప్పుడు షిరిడీ విషయంలో చెలరేగుతున్న వివాదం. సాయిబాబా పుట్టింది, పెరిగింది, సమాధి అయింది షిరిడీలోనే అని ఆ గ్రామస్తులు చెబుతుంటే, కాదు కాదు పాథ్రీ అనే గ్రామంలో సాయి పుట్టాడని మహారాష్ట్ర సర్కార్‌ కొత్త వాదనను తెరపైకి తెచ్చింది.

కర్మభూమి జన్మభూమి. ఇదిప్పుడు షిరిడీ విషయంలో చెలరేగుతున్న వివాదం. సాయిబాబా పుట్టింది, పెరిగింది, సమాధి అయింది షిరిడీలోనే అని ఆ గ్రామస్తులు చెబుతుంటే, కాదు కాదు పాథ్రీ అనే గ్రామంలో సాయి పుట్టాడని మహారాష్ట్ర సర్కార్‌ కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. ఇంతకీ ఏది నిజం? ఎవరిది నిజం? ఇన్నాళ్లుగా లేని వివాదం ఇప్పుడే ఎందుకు పుట్టుకొచ్చింది? ఇది రాజకీయ ఎత్తుగడలో భాగమా ఆధ్యాత్మిక ప్రపంచానికి కొత్త అర్థమా?

షిరిడీ పుణ్యక్షేత్రంలో కొత్త వివాదం - సాయిబాబా జన్మస్థలంపై అభ్యంతరం - ఇంతకీ సాయిబాబాది షిరిడీనా... పాథ్రీనా? - సాయి భక్తులకు షాక్‌ ఇచ్చింది ఎవరు?- ఈ వివాదం ఇప్పుడే కొత్తగా ఎందుకు పుట్టుకొచ్చింది - ఈ వివాదం రాజకీయమా... ఆధ్యాత్మికమా?

మహారాష్ట్ర ప్రభుత్వం పవిత్ర పుణ్యక్షేత్రంగా ఉన్న షిరిడి విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పుడు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పాథ్రీయే సద్గురు సాయిబాబా జన్మస్థలం అంటూ కొందరు వాదిస్తున్నారు. 1999లో అక్కడ శ్రీ సాయి జన్మస్థాన్ మందిరాన్ని నిర్మించారు. భక్తులు భారీగా రావడంతో, మహారాష్ట్ర ప్రభుత్వం పత్రిలోని సాయిబాబా ఆలయ అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు కూడా కేటాయించింది.

అసలు వివాదం ఇక్కడి నుంచే మొదలయింది. పాథ్రీని సాయిబాబా జన్మస్థలంగా అభివృద్ధి చేస్తామన్న సీఎం ఉద్దవ్‌ఠాక్రే ప్రకటనపై షిరిడీ గ్రామస్థులు మండిపడింది. నిరసనగా రేపటి నుంచి షిరిడీలోని సాయిబాబా ఆలయాన్ని నిరవధికంగా మూసివేయాలని డిమాండ్ చేశారు. 1854లో అంటే 16 ఏళ్ల వయస్సులో సాయి షిరిడీకి వచ్చారని తొలుత ఓ వేపచెట్టుకింద సాయి బాబా కనిపించారని, షిరిడీకి 275 కిలోమీటర్ల దూరంలో పర్బాని జిల్లాలో పాథ్రీ అనే ఊరిలో సాయిబాబా జన్మించారని మహారాష్ట్ర సర్కార్‌ చెబుతోందిప్పుడు. అయితే ఆయన అసలు పేరు కూడా ఎవరికి తెలియదట. దీనితో ఖండోబా పూజారి ఒకరు సాయి అని నామకరణం చేసినట్టు చరిత్రలో ఉంది. షిరిడీ సాయిబాబా కర్మభూమి అయితే పాథ్రీ జన్మభూమి అంటున్నారు.

కాగా, బీజేపీ నేతలు మాత్రం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ఈ వివాదం రాజుకుందని ఆలయాన్ని షిర్డీ నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇటు శివసేన మంత్రులు మాత్రం ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయిస్తే ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. పత్రీయే సాయినాథుని జన్మస్థలమనే విషయాన్ని గతంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ కూడా సమ్మతించారని చెబుతున్నారు. షిరిడీ సాయిబాబా కర్మభూమి అయితే పత్రి జన్మభూమి అని స్పస్టం చేస్తున్నారు. మరి రేపటి లోపు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories