Coronavirus: విభిన్నంగా క్వారంటైన్.. చెట్లపైనే గుడారాలు

Coronavirus: విభిన్నంగా క్వారంటైన్.. చెట్లపైనే గుడారాలు
x
Highlights

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. దేశంలోనూ ఈ కోవిడ్ ధాటికి వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. దేశంలోనూ ఈ కోవిడ్ ధాటికి వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 20కి పైగా మృత్యువాత పడ్డారు. కరోనా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం 21రోజులు లాక్ డౌన్ ప్రకటించింది. ప్రజలంతా 21 రోజులపాటు ఇళ్లలోనే స్వీయ నిర్బంధంలో ఉండాలని ప్రధాని మోదీ ప్రధాని పిలునిచ్చిన సంగతి తెలిసిందే.

పశ్చిమ బెంగాల్‌లో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే 15 మందికి పాజిటివ్ ఉండగా.. ఒకరు మరణించారు. ఈ పరిస్థితుల్లో ప్రజలంతా సీఎం మమతా బెనర్జీకి అండగా నిలుస్తున్నారు. స్వయంగా లాక్‌డౌన్ విధించుకుంటూ ఈ మహమ్మారి మరింత వ్యాపించకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇటీవలే చెన్నై నుంచీ బెంగాల్ వచ్చిన వంగిడి గ్రామ ప్రజలు చెట్లపై లాక్ డౌన్ విధించుకోవడం అందరి దృష్టినీ ఆకర్షించింది.

ఆ గ్రామంలో చాలా మందికి ఇళ్లు లేవు. వున్న ఇళ్లలో ఒక్కరూ పెట్టడానికే సరిపోదు చిన్నవి. చిన్న ఇంట్లో అందరూ నివసించాల్సి ఉంటుంది. దీంతో సమూహంగా వుంటే కరోనా వచ్చే అవకాశం వుంటుంది. క్వారంటైన్ చెన్నై నుంచి వచ్చిన వాళ్లు ఇలా చెట్లెక్కి ఆ కొమ్మలపైనే పరదాలు వేసుకొని నానా తిప్పలు పడుతూ.. కొమ్మలపై ఉంటున్నారు. తిండి, నిద్ర ఆ కొమ్మాలపైనే. ఇది ఎంతో ప్రమాదకరం అయినప్పటికీ... ప్రధాని నిర్ణయాన్ని పాటిస్తామని చెబుతున్నారు.

చెట్లపై నుంచి ఇళ్లలోకి వెళ్లబోమని అంటున్నారు. ఇళ్లలోకి వెళ్తే సమూహంగా వుండాలి పొరపాటున తమకు కరోనా వైరస్ ఉంటే... తమ వాళ్లకు అది వ్యాపిస్తుందనీ, అలా జరగనిచ్చే ప్రసక్తే లేదంటున్నారు. యువకులు తీసుకున్న నిర్ణయానికి అందరూ స్వాగతిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories