Mamata Banerjee: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీకి మరోసారి గాయం

Mamata Banerjee: ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా తూలి పడిన మమతా బెనర్జీ

Shashank Gullapelli
Updated on: 27 April 2024 5:30 PM IST
West Bengal CM Mamata Banerjee Is Injured Once Again
X

Mamata Banerjee: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీకి మరోసారి గాయం

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి గాయపడ్డారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు హెలికాప్టర్‌ ఎక్కిన ఆమె అదుపుతప్పి తూలి కింద పడిపోయారు. పశ్చిమ బర్ధమాన్‌ జిల్లాలోని దుర్గాపుర్‌ నుంచి దీదీ అసన్‌సోల్‌ వెళ్లేందుకు హెలికాప్టర్‌ ఎక్కారు. లోపలికి వెళ్లి సీట్లో కూర్చునే సమయంలో ఆమె బ్యాలెన్స్‌ కోల్పోయి కిందపడ్డారు. దీన్ని గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే సాయం చేశారు. ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయమైందని, అయినప్పటికీ సీఎం తన ప్రయాణాన్ని కొనసాగించారని అధికారులు వెల్లడించారు. అసన్‌సోల్‌ స్థానం నుంచి TMC తరఫున ఎంపీ శతృఘ్నసిన్హా పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా మమతా బెనర్జీ ప్రచారం చేసేందుకు వెళ్లే సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story