ప్రధాని మోడీపై బెంగాల్‌ సీఎం తీవ్ర వ్యాఖ్యలు

Arun Chilukuri
Updated on: 24 Feb 2021 10:00 PM IST
ప్రధాని మోడీపై బెంగాల్‌ సీఎం తీవ్ర వ్యాఖ్యలు
X

ప్రధాని మోడీపై బెంగాల్‌ సీఎం తీవ్ర వ్యాఖ్యలు

ప్రధాని నరేంద్ర మోడీపై సీఎం మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మోడీ పెద్ద ఎత్తున అల్లర్లు సృష్టించే వ్యక్తి అంటూ తీవ్రమైన కామెంట్స్‌ చేశారు. హుగ్లీలోని షాన్‌గంజ్ సభలో ఆమె ప్రసంగించారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షా ద్వయం విపరీతమైన అబద్ధాలను ప్రచారం చేస్తూ.. దేశ వ్యాప్తంగా విద్వేషాన్ని పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. అల్లర్ల ద్వారా ట్రంప్ సాధించిందేమిటి..? అంతకంటే ఘోరమైన ఇబ్బందులను మోడీ ఎదుర్కొంటారు. హింస ద్వారా సాధించేది ఏమీ లేదని మమత వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో తామే గోల్‌ కీపర్లమని, బీజేపీ ఒక్క గోల్‌నూ సాధించలేదని ధీమా వ్యక్తం చేశారు బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story