ఆర్థికవేత్త అమర్త్యసేన్‌కు అండగా నిలిచిన ప.బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

* బీజేపీపై పరోక్షంగా విమర్శలు చేసిన సీఎం * సోదరిలా అండగా ఉంటానని హామీ

admin
Published on: 26 Dec 2020 8:06 AM IST
ఆర్థికవేత్త అమర్త్యసేన్‌కు అండగా నిలిచిన ప.బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
X

బెంగాల్‌లో విశ్వభారతి యూనివర్శిటీలో భూముల ఆక్రమణకు సంబంధించిన అంశాలతో ఆర్థిక వేత్త అమర్త్యసేన్‌కు సంబంధం ఉందన్న ఆరోపణలు పశ్చిమబెంగాల్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ విషయంపై స్పందించిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీజేపీ నేతల తీరుపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

కొంతమంది నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, వారి తీరు తనను విస్మయానికి గురి చేసిందన్నారు. ఓ సోదరిలా ఆయన వెంట ఉంటానని అంతా కలిసి సమస్యలను అధిగమిద్దామంటూ అండగా నిలిచారు. ఈ క్రమంలో అమర్త్యసేన్‌కు మద్దతు ప్రకటిస్తూ మమతా బెనర్జీ బహిరంగా లేఖ రాశారు..

admin

admin

Next Story