ఆర్ధికమంత్రికి బదులుగా బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సీఎం మమతాబెనర్జీ

*బడ్జెట్ సమావేశాలను బహిష్కరించిన కాంగ్రెస్, వామపక్షాలు *సభలో నిరసన వ్యక్తం చేసిన బీజేపీ సభ్యులు *బడ్జెట్ సమావేశాలకు గవర్నర్‌ను ఆహ్వానించని బెంగాల్ ప్రభుత్వం

Samba Siva Rao
Published on: 5 Feb 2021 7:50 PM IST
ఆర్ధికమంత్రికి బదులుగా బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సీఎం మమతాబెనర్జీ
X

 సీఎం మమతాబెనర్జీ ఫైల్ ఫోటో  

నిబంధనలకు విరుద్దంగా పశ్చిమబెంగాల్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. బడ్జెట్ సమావేశాల ప్రారంభంరోజున గవర్నర్ తొలి ప్రసంగం చేయడం ఆనవాయితి. అయితే మమత సర్కార్ మాత్రం నిబంధనలను పక్కకు పెట్టింది. రాష్ర్ట ఆర్ధిక మంత్రి అనారోగ్య కారణాలతో సమావేశాలకు దూరంగా ఉండటంతో ముఖ్యమంత్రి మమతనే సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. గవర్నర్ ను సభకు ఆహ్వానించనందుకు బీజేపీ సభ్యులు సభలో నిరసనకు దిగారు. కాంగ్రెస్, వామపక్షాల సభ్యులు మాత్రం బడ్జెట్ సమావేశాలను బహిష్కరించారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story