Karnataka - Weekend Curfew: కర్ణాటకలో వీకెండ్‌ కర్ఫ్యూ

Karnataka - Weekend Curfew: *మెడికల్‌ కాలేజీలు మినహా అన్ని కాలేజీలు బంద్ *50శాతం ఆక్యుపెన్సీతో మాల్స్‌, థియేటర్లు పబ్స్

Shireesha
Published on: 5 Jan 2022 9:14 AM IST
Weekend Curfew in Karnataka Declared by Minister Ashok | Corona Cases in Karnataka
X

Karnataka - Weekend Curfew: కర్ణాటకలో వీకెండ్‌ కర్ఫ్యూ

Karnataka - Weekend Curfew: కరోనా కేసులు పెరుగుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కరోనా కేసులను కంట్రోల్ చేసేందుకు నైట్ కర్ఫ్యూతో పాటు వీకెండ్ కర్ఫ్యూను అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు వీకెండ్ కర్ఫ్యూ ఉంటుందని ఆ రాష్ట్ర మంత్రి అశోక్ తెలిపారు.

రాబోయే రెండు వారాల పాటు బెంగళూరులోని 1 నుంచి 9 తరగతి స్కూల్స్‌ మూసివేస్తున్నట్టు వెల్లడించారు. అలాగే థియేటర్లు, మాల్స్, పబ్‌లు, బార్‌లను 50 శాతం సామర్థ్యంతో నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. పెళ్లిళ్ల విషయంలోనూ కొత్త రూల్స్ విధించారు. మరోవైపు రాష్ట్రంలో ఎలాంటి నిరసనలకు అనుమతి లేదని మంత్రి ఆశోక్‌ స్పష్టం చేశారు.

Shireesha

Shireesha

Next Story