నోయిడాలోని సెక్టార్‌-21లో కూలిన ప్రహరీ గోడ

*9 మందిని కాపాడిన సహాయక బృందాలు

Rama Rao
Updated on: 20 Sept 2022 12:15 PM IST
Wall Collapses in Noida Sector 21 | Telugu News
X

నోయిడాలోని సెక్టార్‌-21లో కూలిన ప్రహరీ గోడ

Noida: ఉత్తరప్రదేశ్‌ నోయిడా సెక్టార్‌-21లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రహరీగోడ కూలిపోయిన ఘటనలో నలుగురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. శిథిలాల కింది చిక్కుకొని ఉన్న 9 మందిని సహాయక బృందాలు కాపాడాయి. డ్రెయిన్‌ మరమ్మతులు చేస్తున్న సమయంలో 200 మీటర్ల పొడవున ప్రహరీ గోడ కూలిపోయినట్లుగా తెలుస్తోంది. ఆ సమయంలో అక్కడ 12 మంది కూలీలు పని చేస్తున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి పోలీసులు, రెస్క్యూ బృందాలు చేరుకొని.. శిథిలాలను తొలగిస్తున్నాయి.

Rama Rao

Rama Rao

Next Story