logo
జాతీయం

లోక్‌సభ ముందుకు ఓటర్‌ ఐడీ - ఆధార్‌ అనుసంధాన బిల్లు.. వ్యతిరేకించిన కాంగ్రెస్‌ సహా విపక్షాలు

Voter ID and Aadhar Card Link Bill Passed in Lok Sabha Today 20 12 2021 Opposed by Congress and Oppositions | Live News
X

లోక్‌సభ ముందుకు ఓటర్‌ ఐడీ - ఆధార్‌ అనుసంధాన బిల్లు.. వ్యతిరేకించిన కాంగ్రెస్‌ సహా విపక్షాలు

Highlights

Lok Sabha Today: బిల్లును వ్యతిరేకిస్తూ లోక్‌సభలో ఎంఐఎం నోటీసులు...

Lok Sabha Today: లోక్‌సభలో ఎన్నికల చట్టాల సవరణ బిల్లు 2021ను ప్రవేశపెట్టారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజుజు సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లును కాంగ్రెస్‌ సహా పలు ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. ఇది పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందని ఆరోపించాయి. అంతేగాక, సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తోందని దుయ్యబట్టాయి.

అయినప్పటికీ దీన్ని ప్రవేశపెట్టేందుకు స్పీకర్‌ అంగీకరించడంతో కేంద్రమంత్రి బిల్లును సభ ముందుకు తీసుకొచ్చారు. ఈ బిల్లుతో పాటు లఖింపుర్‌ ఘటన, ఇతర అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడంతో ఈ బిల్లుపై చర్చ మొదలుపెట్టకుండానే లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది.

ఓటర్ల జాబితాను బలోపేతం చేయడం, ఓటింగ్‌ ప్రక్రియను మరింత మెరుగుపరచడం, ఈసీకి మరిన్ని అధికారాలు కల్పించడంతో పాటు బోగస్‌ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా పలు ప్రతిపాదనలున్న ఈ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోద ముద్రవేసింది. పాన్-ఆధార్ లింక్ చేసినట్లు గానే, ఓటర్‌ ఐడీ లేదా ఎలక్టోరల్‌ కార్డుతో ఆధార్‌ నంబర్‌ను అనుసంధానం చేయనున్నారు.

Web TitleVoter ID and Aadhar Card Link Bill Passed in Lok Sabha Today 20 12 2021 Opposed by Congress and Oppositions | Live News
Next Story