Tamil Nadu: తమిళ పాలిటిక్స్‌ను వేడెక్కిస్తోన్న శశికళ రీ ఎంట్రీ

Tamil Nadu: శశికళ రీ ఎంట్రీ వార్తలతో తమిళనాడు రాజకీయాలు వేడెక్కుతున్నాయి.

Arun Chilukuri
Published on: 1 Jun 2021 12:04 PM IST
VK Sasikala will not be Taken Back: AIADMK
X

శశికళ(ఫైల్ ఇమేజ్ )

Tamil Nadu: శశికళ రీ ఎంట్రీ వార్తలతో తమిళనాడు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అన్నా డీఎంకే కార్యకర్తలతో శశికళ ఫోన్‌లో మాట్లాడి.. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని చెప్పారనే వార్తలు ఇప్పుడు తమిళనాట హల్‌చల్‌ చేస్తున్నాయి. దీనిపై స్పందించిన అన్నా డీఎంకే నేతలు శశికళను పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. పార్టీపై తిరిగి పట్టు సాధించాలనే ఉద్దేశంతో గందరగోళం సృష్టిస్తున్నారని ఆ పార్టీ డిప్యూటీ కోఆర్డినేటర్ కేపీ మునుసామి ఆరోపించారు. తమ పార్టీ కార్యకర్తలతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని, ఆమె చాలా రోజుల నుంచి పార్టీలో లేదని మునుసామి తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story