Tamil Nadu: తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు

*రాజకీయంగా యాక్టివ్ కాబోతున్న చిన్నమ్మ *జయలలిత సమాధి వద్దకు శశికళ *అమ్మకు నివాళులర్పించనున్న చిన్నమ్మ

Shilpa
Published on: 16 Oct 2021 11:42 AM IST
VK Sasikala Visits Jayalalithaa Memorial to Mark AIADMKs 50th Foundation Day
X

జయలలిత సమాధి వద్దకు శశికళ(ఫైల్ ఫోటో)

Tamil Nadu: తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలవుతున్నాయి. జయలలిత హయాంలో ఒక వెలుగు వెలిగిన చిన్నమ్మ రాజకీయంగా యాక్టివ్ కాబోతున్నారు. కాసేపట్లో మెరీనా బీచ్ లోని జయలలిత సమాధి దగ్గరకు వెళ్లి నివాళులర్పించనున్నారు. నివాళులర్పించాక అక్కడి నుంచే తన పొలిటికల్ రీ ఎంట్రీపై చిన్నమ్మ ప్రకటన చేసే అవకాశముంది.

ఇప్పటికే మద్దతు దారులతో శశికళ భవిష్యత్ రాజకీయం పైన మంతనాలు చేసినట్లుగా తెలుస్తోంది. అన్నాడీఎంకే స్థాపించి 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు జరుపుతున్నారు. ఈ సమయాన్ని చిన్నమ్మ తనకు అనుకూలంగా మార్చుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

Shilpa

Shilpa

Next Story