క్షీణించిన శశికళ ఆరోగ్యం

VK Sasikala Tests Coronavirus Positive
x
Highlights

శ్వాస సంబంధిత సమస్యలు, వెన్నునొప్పితో ఇబ్బంది పడుతూ ఆసుపత్రిలో చేరిన శశికళ ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు తెలిపారు. బెంగళూరులోని బౌరింగ్‌ ఆసుపత్రిలో...

శ్వాస సంబంధిత సమస్యలు, వెన్నునొప్పితో ఇబ్బంది పడుతూ ఆసుపత్రిలో చేరిన శశికళ ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు తెలిపారు. బెంగళూరులోని బౌరింగ్‌ ఆసుపత్రిలో ఆమెకు తొలుత రెండుసార్లు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలను నిర్వహించగా నెగెటివ్‌ వచ్చింది. ఆ ఆసుపత్రిలో సీటీ స్కాన్‌ లేకపోవడంతో అక్కడి నుంచి ఆమెను విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చేసిన సీటీ స్కాన్‌ పరీక్షలో ఆమెకు కరోనా ఉన్నట్లు తేలింది. దీంతో పాటు రక్తపోటు, మధుమేహం సమస్యలు కూడా ఉన్నాయని తేలింది. శశికళ ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్టు విక్టోరియా ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని, ఆమె ఆరోగ్యం క్షీణించిందని తెలిపారు.

ఈ నెల 27న ఉదయం ఆమె జైలు నుంచి విడుదల కాబోతున్నారని శశికళ తరఫు న్యాయవాది ఇటీవల వెల్లడించారు. 2016లో జయలలిత మరణానంతరం అక్రమాస్తుల కేసులో ఆమె అరెస్టయ్యారు. దీంతో నాలుగేళ్లుగా ఆమె బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే, సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు 10కోట్లు జరిమానా చెల్లించి ఏడాది ముందుగానే విడుదల కాబోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories