VK Paul: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతుంది

VK Paul: థర్డ్‌వేవ్‌ సంకేతాలు వస్తున్నాయి : వీకే పాల్‌ * భారత్‌లో థర్డ్‌ వేవ్‌ ప్రారంభం కాలేదని వీకే పాల్‌ స్పష్టీకరణ

Sandeep Eggoju
Updated on: 14 July 2021 10:49 AM IST
VK Paul Says increasing Corona Cases in the World
X

నీతి ఆయోగ్ సభ్యుడు వీకె పాల్ (ఫైల్ ఇమేజ్)

VK Paul: భారత్‌లో కరోనా థర్డ్‌ వేవ్‌ ప్రమాదం పొంచి ఉందని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ హెచ్చరించారు. ప్రపంచ దేశాల్లో కొన్నిచోట్ల థర్డ్‌వేవ్‌ ప్రారంభమైందన్న సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 3.9లక్షలకుపైగా రోజువారీ కరోనా కేసులు నమోదవుతున్నట్లు ఈ నేపథ్యంలోనే థర్డ్‌ వేవ్‌ తథ్యమని భావిస్తున్నట్టు తెలిపారు.

ప్రస్తుతానికి భారత్‌లో థర్డ్‌వేవ్‌ సంకేతాలు లేవన్న వీకే పాల్‌ ఇప్పటినుంచే అప్రమత్తత పాటించడం మేలన్నారు. ఇక ఈ ఏడాది ఆరంభంలో సెకండ్‌ వేవ్‌ ప్రారంభం కాగా మొదట్లో రోజుకు 9లక్షల వరకు కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు వచ్చాయని వివరించారు. ఇక కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌పైనా, కొత్త వేరియంట్లపైనా మోదీ కూడా హెచ్చరించాని వెల్లడించారు. దేశంలో ఆంక్షలు ఎత్తివేయడం అంటే వైరస్‌ నిర్మూలన జరిగినట్టు కాదన్నారు వీకే పాల్‌.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story