Viral News: ఈ కుక్క 67మంది ప్రాణాలను కాపాడింది..

Viral News
x

Viral News: ఈ కుక్క 67మంది ప్రాణాలను కాపాడింది..

Highlights

Viral News: కుక్క విశ్వాసానికి మారుపేరు. అందుకే కుక్క తన యజమానిని ప్రాణాలు కాపాడిందని, పలువురిని కాపాడిందని వార్తులు తరచూ వింటుంటాం. ఇప్పుడు కూడా ఒక లేకపోతే 67 మంది చనిపోయేవారు.

Viral News: కుక్క విశ్వాసానికి మారుపేరు. అందుకే కుక్క తన యజమానిని ప్రాణాలు కాపాడిందని, పలువురిని కాపాడిందని వార్తులు తరచూ వింటుంటాం. ఇప్పుడు కూడా ఒక లేకపోతే 67 మంది చనిపోయేవారు. వారిందరు ఇప్పుడు సురక్షితంగా ఉన్నారంటే ఈ కుక్కే కారణం. అసలు జరిగింది ఏంటో చూద్దాం.

హిమాచల్ ప్రదేశ్‌లో భారీగా వరదలు ముంచెత్తుతున్నాయి. ఎంతోమంది ఈ వరదల్లో ప్రాణాలు కోల్పోయారు. పలువురు గల్లంతయ్యారు. ఎక్కువ ఆస్తినష్టం కూడా సంభవించిందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మరోపక్క ఒక కుక్క గ్రామంలో ఉన్న 67మంది ప్రాణాలు కాపాడింది.

హిమాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు ఎక్కువగా విరుచుకుపడుతున్నాయి. గత వారం సియాతి గ్రామంపై కూడా కొండచరియ విరిగిపడింది. అదే జరగిన కొద్ది నిమిషాల ముందు ఆ ఊరిలోని వారంతా నిద్రపోతున్నారు. అయితే అక్కడ ఒక వ్యక్తి పెంచుకున్న కుక్క అరవడాన్ని చూసి పరుగున బయటకు వచ్చి చూశాడు. దీంతో అప్పటికి ఇంటి గోడలపై పగుళ్లు ఏర్పడ్డాయి. వెంటనే ఆ వ్యక్తి చుట్టుపక్కల వారిని లేపి, అక్కడ నుంచి దూరంగా వెళ్లిపోయారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున కొండచరియలు ఆ ఊరిపై విరిగి పడ్డాయి.

కుక్క విశ్వాసానికి మారు పేరు. కుక్కే తమ ప్రాణాలను కాపాడింది. ఇప్పుడు ఊరిజనం అంతా అంటున్నారు. కుక్క లేకపోతే ఈ రోజు మేమంతా ప్రాణాలతో ఉండేవాళ్లం కాదని చెబుతున్నారు. ప్రస్తుతం వీరంతా త్రియంబల గ్రామంలో నిర్మించిన నైనా దేవి ఆలయంలో ఆశ్రయం పొందుతున్నారు. ప్రభుత్వం వీరికి 10వేల రూపాయల వరకు ఆర్ధిక సాయం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories