Viral: క్లాస్‎రూమ్‎లోనే స్టూడెంట్‎ను పెళ్లి చేసుకున్న మహిళా ప్రొఫెసర్

Viral: క్లాస్‎రూమ్‎లోనే స్టూడెంట్‎ను పెళ్లి చేసుకున్న మహిళా ప్రొఫెసర్
x
Highlights

Viral: వెస్ట్ బెంగాల్లో జరిగిన ఓ సంఘటన నెట్టింట్లో వైరల్ గా మారింది. నాదియా జిల్లాలోని మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ తరగతి గదిలో...

Viral: వెస్ట్ బెంగాల్లో జరిగిన ఓ సంఘటన నెట్టింట్లో వైరల్ గా మారింది. నాదియా జిల్లాలోని మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ తరగతి గదిలో ఓ సీనియర్ మహిళా ప్రొఫెసర్..స్టూడెంట్ ను పెళ్లి చేసుకున్న వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియో ఇప్పుడు కలకలం రేపుతోంది. తరగతిలో భాగమైన సైకో డ్రామా ప్రదర్శనగా దీన్ని ప్రొఫెసర్ చెబుతుండగా..ఈ ఘటనపై యూనివర్సిటీ విచారణకు ఆదేశించింది.

ఆమె నుంచి వివరణ కోరిన అధికారులు విచారణ ముగిసేదాకా సెలవుపై వెళ్లాల్సిందిగా కోరారు. అయితే ఈ వీడియోను తప్పుగా లీక్ చేశారని ..తన పరువు తీసేందుకు కుట్ర పన్నారని మహిళా ప్రొఫెసర్ ఆరోపించారు. కొందరు విద్యార్థులు ఉద్దేశపూర్వకంగా దీన్ని వైరల్ చేశారని మండిపడ్డారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

సంబంధిత విద్యార్థికి కూడా అదే విధంగా సూచించారు. నవవధువులా అలంకరణలో ఉన్న ప్రొఫెసర్ కు ఫస్టియర్ విద్యార్థికి నడుమ జరిగిన ఈ తంతులో హిందూ బెంగాళీ వివాహ సంప్రదాయం ప్రకారం.. బొట్టు పెట్టుకోవడం, దండలు మార్చుకోవడం వంటి తంతులన్నీ కూడా జరిపించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories