Ram Gopal Varma: ఉమెన్స్ డే రోజు ఆర్జీవీ వివాదాస్పద ట్వీట్..నెట్టింట్లో వైరల్

Ram Gopal Varma: వివాదాలకు కేరాఫ్ ఆడ్రస్ రామ్ గోపాల్ వర్మ.

Samba Siva Rao
Updated on: 8 March 2021 12:42 PM IST
Ramgopal Varma Tweet On Womens Day
X

రాంగోపాల్ వర్మ (ఫైల్ ఫోటో )

Ram Gopal Varma: వివాదాలకు కేరాఫ్ ఆడ్రస్ రామ్ గోపాల్ వర్మ. ఆయన తన సినిమాలతో, ట్వీట్స్‌తో వివాదాలకు కేంద్ర బిందువు అయ్యాడు. ఎప్పుడూ ఎదో ఒక విషయంలో కాంట్రవర్సీ చేస్తూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. ఎలాంటి విషయాలైనా నిర్మొహమాటంగా చేప్పే వర్మ.. తాజాగా ఉమెన్స్ డే సందర్భంగా తనదైన మార్క్‌లో ఓ ట్వీట్ చేశాడు. రామ్ గోపాల్ వర్మ అంతర్జాతీయ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశాడు. "మహిళలు ప్రతి రోజు సంతోషంగా ఉండాలని నేను కోరకుంటున్నాను. అందుకే వారికి మహిళాదినోత్సవ శుభాకాంక్షలు చెప్పను" అంటూ వర్మ తన ట్వీట్ లో పేర్కొన్నాడు. వర్మ ట్వీట్‌పై పలువురు నెటిజన్లు అభ్యంతరం చెబితే. మరి కొందరూ ఆర్జీవీకి మద్దతుగా ట్వీట్స్ చేస్తున్నారు.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story