స్పైస్‌జెట్‌ విమానంలో సిగరెట్‌ తాగుతూ సెల్ఫీ వీడియో.. నెటిజన్లు ఆగ్రహం..

SpiceJet: ఓ వ్యక్తి స్పైస్‌జెట్‌ విమానంలో సిగరెట్‌ తాగిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Arun Chilukuri
Published on: 11 Aug 2022 3:58 PM IST
Video of Bobby Kataria smoking in Spicejet Flight Goes Viral
X

స్పైస్‌జెట్‌ విమానంలో సిగరెట్‌ తాగుతూ సెల్ఫీ వీడియో.. నెటిజన్లు ఆగ్రహం..

SpiceJet: ఓ వ్యక్తి స్పైస్‌జెట్‌ విమానంలో సిగరెట్‌ తాగిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. లైటర్‌తో సిగరెట్‌ వెలిగించుకుంటూ సెల్ఫీ వీడియో తీసుకొని దాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌ అయింది. గుర్‌గావ్‌కు చెందిన బాబీ కటారియా అనే వ్యక్తి స్పైస్‌జెట్‌ విమానంలో దుబాయ్‌ నుంచి న్యూఢిల్లీకి వెళ్లాడు. ఆ సమయంలోనే ఫ్లయిట్‌లో తన సీట్లో పడుకొని సిగరెట్‌ అంటించాడు. పొగతాగుతున్న దృశ్యాలను సెల్ఫీ వీడియో తీసుకొని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆగ్రహంతో ఊగిపోయారు. ఇలా చేయడం వల్ల వందల మంది ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందంటూ మండిపడ్డారు. విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియాకు ఈ వీడియోను పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన సింథియా ఘటనపై దర్యాప్తు చేపట్టామని, అలా ప్రమాదకరంగా ప్రవర్తించేవారిని ఎట్టిపరిస్థితుల్లోను వదిలేది లేదని ట్వీట్‌ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story