అన్నాడీఎంకే కేసులో పళనిస్వామికి భారీ విజయం

* మద్రాస్ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు

Dhatripriya
Published on: 23 Feb 2023 2:06 PM IST
Victory For Palaniswami In The AIADMK Case
X

అన్నాడీఎంకే కేసులో పళనిస్వామికి భారీ విజయం

Tamil Nadu: తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సుప్రీంకోర్టులో తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి విజయం సాధించారు. పళనిస్వామికే అన్నాడీఎంకే పగ్గాలు దక్కాయి. మద్రాస్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిపై పళనిస్వామి, పన్నీర్‌ సెల్వం కోర్టుమెట్లెక్కారు. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఈపీఎస్‌కు మద్రాస్ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో మద్రాస్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పన్నీర్‌సెల్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.

Dhatripriya

Dhatripriya

Next Story