Venkaiah Naidu: కర్ణాటకలో పర్యటించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

* నాకు ఇష్టమైన రాజుల్లో శ్రీకృష్ణదేవరాయలు ఒకరు * శిల్ప కళావేదికలకు నిలువెత్తు నిదర్శనం విజయనగర సామ్రాజ్యం

Sandeep Reddy
Published on: 21 Aug 2021 7:32 PM IST
Vice President Venkaiah Naidu Visits Karnataka
X

వెంకయ్య నాయుడు (ఫైల్ ఫోటో)

Venkaiah Naidu: ఘనమైన సంస్కృతి, వారసత్వాలకు నిలయమైన భారతదేశం గత వైభవం గురించి నేటి యువత తెలుసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. కర్ణాటక పర్యటనలో ఉన్న ఆయన కుటుంబ సమేతంగా చారిత్రక హంపి నగరాన్ని సందర్శించారు. ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తించిన హంపిలో విజయనగర సామ్రాజ్య గత వైభవపు ఆనవాళ్లు ఉన్నాయన్నారు. వ్యక్తిగతంగా శ్రీకృష్ణదేవరాయలును తాను ఎంతో అభిమానిస్తుంటానని చెప్పారు. రాయల కాలంలో అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించడమే కాకుండా వ్యవసాయం ప్రాధాన్యతను గుర్తించి రైతుల కోసం చెరువులు తవ్వించిన విషయాన్ని గుర్తు చేశారు. సాహితీసమరాంగణ సార్వభౌమునిగా రాయలు ప్రసిద్ధిగాంచారన్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story