Venkaiah Naidu: ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు మరోసారి కరోనా

Venkaiah Naidu: భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు మరోసారి కరోనా సోకింది.

Arun Chilukuri
Published on: 23 Jan 2022 5:14 PM IST
Vice President Venkaiah Naidu Tests Positive for Coronavirus
X

Venkaiah Naidu: ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు మరోసారి కరోనా 

Venkaiah Naidu: భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు మరోసారి కరోనా సోకింది. గతంలో ఓసారి కోవిడ్ నుంచి కోలుకున్న ఆయనకు తాజాగా రెండోసారి కరోనా సోకింది. ఆదివారం జరిపిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వెంకయ్య నాయుడు హైదరాబాద్‌లోని తన నివాసంలో వారం రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండనున్నారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారు తప్పనిసరిగా కరోనా టెస్టులు చేయించుకోవాలని , అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఐసోలేషన్‌లో ఉండాలని వెంకయ్య నాయుడు కోరారు. 2020 సెప్టెంబర్‌లో తొలిసారిగా ఉపరాష్ట్రపతికి కరోనా సోకింది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story