Veerappan Daughter Vidhya as Bjp Youth Wing Leader: వీరప్పన్‌ కుమార్తె విద్యకు బీజేపీ బంపర్ ఆఫర్..

Veerappan Daughter Vidhya as Bjp Youth Wing Leader: వీరప్పన్ లేదా కూసే మునిస్వామి వీరప్పన్ గౌండర్ ఇతను పేరు ప్రతి ఒక్కరు వినే ఉంటారు.

Sumitra
Updated on: 19 July 2020 5:15 PM IST
Veerappan Daughter Vidhya as Bjp Youth Wing Leader: వీరప్పన్‌ కుమార్తె విద్యకు బీజేపీ బంపర్ ఆఫర్..
X
Veerappan Daughter Vidhya (File Photo)

Veerappan Daughter Vidhya as Bjp Youth Wing Leader: వీరప్పన్ లేదా కూసే మునిస్వామి వీరప్పన్ గౌండర్ ఇతను పేరు ప్రతి ఒక్కరు వినే ఉంటారు. ఒకప్పుడు వీరప్పన్ భారతదేశంలోనే పేరుమోసిన బందిపోటు. ఆయన కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలను గడగడలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్. అంతే కాదు ఆయన స్మగ్లింగ్ చేయడం మాత్రమే కాదు కన్నడకంఠీరవుడు ఇంకా కొందరు నాయకులను కిడ్నాప్ కూడా చేశాడు. అలాంటి అడవి దొంగ వీరప్పన్‌ కూతురు విద్యా వీరప్పన్‌కు బీజేపీ కీలక బాధ్యతలను అప్పగించింది. వృత్తిరీత్యా న్యాయవాది అయిన విద్య గత పిబ్రవరిలో తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

అయితే అప్పటి నుంచి విద్య బీజేపీ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ నేతలు తమిళనాడు యువమోర్చా విభాగం ఉపాధ్యక్షురాలిగా ఆదివారం ఆమెను నియమించింది. కాగా పాత వీరప్పన్‌ వర్గాన్ని మొత్తం బీజేపీ వైపుకు తిప్పలా విద్య కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరికొద్ది నెలల్లోనే తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో వీరప్పన్ వర్గాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర స్థాయిలో పదవిని విద్యకు కట్టబెట్టారు. గంధపు చెక్కల స్మగ్లర్‌గా దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన వీరప్పన్‌ 2004లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే.


Sumitra

Sumitra

Next Story