Varavara Rao Health Condition: వరవరరావుకు సీరియస్ : ఆయన సహచరి ‌

Varavara Rao Health Condition: విప్లవ రచయితల సంఘం అధ్యక్షుడు పి.వరవరరావు ముంబైలోని తలోజ జైలులో తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారని తెలిసింది.

Raj
By Raj
Updated on: 12 July 2020 10:18 AM IST
Varavara Rao Health Condition: వరవరరావుకు సీరియస్ : ఆయన సహచరి ‌
X
Varavara Rao (File Photo)

Varavara Rao Health Condition: విప్లవ రచయితల సంఘం అధ్యక్షుడు పి.వరవరరావు ముంబైలోని తలోజ జైలులో తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారని తెలిసింది, దీంతో ఆయనను వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాలని కుటుంబసభ్యులతో పాటు హక్కుల కార్యకర్తలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మహా రాష్ట్ర– ముంబై–తలోజ జైలులో విచారణ ఖైదీగా ఉన్నారు వరవరరావు.. ఇప్పటికే జైలు అధికారులు వరవరరావు తో ఫోన్లో మాట్లాడించారని.. ఆయన మాటలలో తేడా ఉందని.. గొంతు మొద్దు భారినట్టు మాట్లాడుతున్నారని ఆయన సహచరి హేమలత ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని బట్టి చూస్తే వరవరరావు బాగా క్షీణించారన్న విషయం అర్ధమవుతుందని ఆమె అన్నారు. ఆయన పక్కనే ఉన్న వ్యక్తి కూడా తనతో ఇదే చెప్పాడని అన్నారు.

మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వరవరరావును ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించేట్టుగా చర్యలు చేపట్టాలని నిర్బంధ వ్యతిరేక వేదిక తెలంగాణ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ జి.హరగోపాల్‌ సీఎం కేసీఆర్‌కు శనివారం లేఖ రాశారు. ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై 2018 నవంబర్‌లో అరెస్టైన వరవరరావును మొదట మహారాష్ట్ర పుణె లోని ఎరవాడ జైలుకు తరలించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎరవాడ నుంచి నవీ ముంబైలోని తలోజా జైలుకు తరలించారు. అయితే తలోజా జైలులో కరోనా బారిన పడి ఒకరు మరణించగా.. ఈ క్రమంలో వృద్ధుడైన తమ తండ్రిని జైలు నుంచి విడుదల చేయాలంటూ వరవరరావు కుమార్తెలు లేఖలు కూడా రాశారు.


Raj

Raj

Next Story