Varanasi court: 1991లో దాఖలైన పిటిషన్‌పై వారణాసి కోర్టు కీలక ఆదేశాలు

Kashi Vishwanath
x

విశ్వనాధ్ టెంపుల్ ఫైల్ ఫోటో 

Highlights

Varanasi court: దేశంలో మరో ఆలయ వివాదానికి రంగం సిద్ధమవుతోంది.

Varanasi court: దేశంలో మరో ఆలయ వివాదానికి రంగం సిద్ధమవుతోంది. వారణాసిలోని కాశి విశ్వనాథ్‌ ఆలయం, గ్యాన్‌వాపి మసీదు కాంప్లెక్స్‌లో పురాతత్వ శాఖ సర్వే చేపట్టాలని అక్కడి సివిల్‌ కోర్టు ఒకటి తీర్పు చెప్పింది. ఈ సర్వేకు అయ్యే ఖర్చును యూపీ ప్రభుత్వం భరించాలని ఆదేశించింది. ఆ సముదాయంలో ఏదైనా నిర్మాణాన్ని కూలదోసి మరొకదాన్ని నిర్మించారా, పునర్నిర్మాణం జరిపారా అనే అంశాన్ని తేల్చాలని కోర్టు ఆదేశించింది.

రస్తోగి అనే న్యాయవాది వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2 వేల ఏళ్ళనాటి కాశీ విశ్వనాథ్‌ ఆలయంలో కొంత భాగాన్ని 1664లో మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబు కూల్చివేశారని 1991లోనే వారణాసి జిల్లా కోర్టులో ఒక పిటిషన్‌ దాఖలైంది. ఆలయం కూల్చివేసిన ప్రదేశంలోనే మసీదు నిర్మించారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అయితే ముస్లిం సంఘాలు ఈ ఆరోపణల్ని ఖండిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories