Vande Bharat Express: మళ్లీ వందే భారత్ రైలు ఆగిపోయింది.. మొన్న గేదెలు.. నిన్న ఆవు.. నేడు..

Vande Bharat Express: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు వరుస ప్రమాదాలను ఎదుర్కొంటున్నాయి.

Arun Chilukuri
Published on: 8 Oct 2022 6:28 PM IST
Vande Bharat Train Suffers Jammed Wheel on Delhi-Varanasi Route
X

Vande Bharat Express: మళ్లీ వందే భారత్ రైలు ఆగిపోయింది.. మొన్న గేదెలు.. నిన్న ఆవు.. నేడు..

Vande Bharat Express: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు వరుస ప్రమాదాలను ఎదుర్కొంటున్నాయి. గత రెండు రోజుల్లో ముంబయి-గాంధీనగర్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రెండుసార్లు పశువులను ఢీకొని ఆగిపోగా.. తాజాగా మరో వందే భారత్‌ రైలులో సాంకేతిక సమస్య ఏర్పడింది. శనివారం వారణాసి బయల్దేరిన ఈ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ట్రాక్షన్‌ మోటార్‌ జామ్‌ అవడంతో మధ్యలోనే ఆగిపోయింది. ఈ లోపాన్ని గుర్తించిన రైల్వే గ్రౌండ్ స్టాఫ్ రైల్వే ఆపరేషన్స్ విభాగానికి సమాచారం అందించారు. వరుసగా మూడో రోజు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావడం పట్ల సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వస్తున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story