రికార్డ్‌ క్రియేట్‌ చేసిన వందే భారత్‌ రైలు.. గంటకు 180 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన ట్రైన్..

Vande Bharat Train Runs at 180 kmph During Trial
x

రికార్డ్‌ క్రియేట్‌ చేసిన వందే భారత్‌ రైలు.. గంటకు 180 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన ట్రైన్..

Highlights

Vande Bharat Train: వందే భారత్‌ పేరుతో సూపర్‌ ఫాస్ట్‌ ట్రైన్‌ రికార్డు సృష్టించింది.

Vande Bharat Train: వందే భారత్‌ పేరుతో సూపర్‌ ఫాస్ట్‌ ట్రైన్‌ రికార్డు సృష్టించింది. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లి కొత్త మైలురాయిని అందుకుంది. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ స్వయంగా ట్వీట్‌ చేసి వివరాలను వెల్లడించారు. ఢిల్లీ-ముంబై రైలు మార్గంలో తాజాగా ట్రైల్‌ రన్‌ రైల్వే శాఖ నిర్వహించింది. కోటా నుంచి మహిద్‌పూర్ రోడ్‌ స్టేషన్‌వరకు 180 కిలోమీటర్ల వేగంతో వందే భారత్‌ దూసుకెళ్లింది. టెస్ట్‌ సమయంలోనే రైలులో వాషింగ్‌, క్లీనింగ్‌తో పాటు అన్ని పరికరాల పనితీరును పరిశీలించినట్టు రైల్వే మంత్రి తెలిపారు. ఈ రైలును మొత్తం 16 కోచ్‌లతో ట్రైల్‌ నిర్వహించినట్టు వివరించారు. మంత్రి చేసిన ట్వీట్‌లో రైలు వేగాన్ని పరీక్షించే స్పీడో మీటరు పక్కనే గ్లాసు నిండా నీరున్నా ఒలకని వీడియోని మంత్రి ట్వీట్‌లో జతచేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories