Gujarat: గుజరాత్‌లో వడగళ్ల వాన బీభత్సం.. సోన్‌గఢ్ ప్రాంతంలో కుంభవృష్టిలా కురిసిన వర్షం

Gujarat: మరో 2రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందన్న నిపుణులు

Dhatripriya
Updated on: 17 March 2023 7:46 PM IST
Vadagalla Vana In Gujarat
X

Gujarat: గుజరాత్‌లో వడగళ్ల వాన బీభత్సం.. సోన్‌గఢ్ ప్రాంతంలో కుంభవృష్టిలా కురిసిన వర్షం 

Gujarat: గుజరాత్‌లో వడగళ్ల బీభత్సం సృష్టించింది. సోన్‌గఢ్‌ ప్రాంతంలో ఒక్కసారిగా వడగళ్ల వాన కురిసింది. ఆకాశానికి భారీ చిల్లు పడిందా అన్నట్లుగా పైనుంచి వడగళ్లు పడ్డాయి. నల్లని తార్ రోడ్డుపై తెల్లని వడగడ్లు గుట్టలు గుట్టలుగా కురవడంతో పలు ఇళ్ల పైకప్పులు దెబ్బతిన్నాయి. అటు రైతులు పండించిన పంటలు వడగళ్ల వానతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో...వడగండ్ల వానలు కురుస్తున్నాయని వాతావరణశాఖ అధికారులు చెప్తున్నారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story