నేడు రేపు వ్యాక్సిన్ నిలుపుదల

Corona vaccine: 27, 28 తేదీల్లో కోవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిలిపివేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది.

Kranthi
Published on: 27 Feb 2021 7:07 AM IST
Vaccine Retention Today and Tomorrow
X

ఫైల్ ఇమేజ్


ఢిల్లీ: ఈ నెల 27, 28 తేదీల్లో కోవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిలిపివేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. వ్యాక్సినేషన్‌ ఐటి వ్యవస్థను కో-విన్‌ 1.0 నుంచి కో-విన్‌ 2.0కు మారుస్తున్న కారణంగా శని, ఆదివారాల్లో వ్యాక్సినేషన్‌ ఉండదని ప్రకటనలో తెలిపింది. మరోవైపు టీకా కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతోందని తెలిపింది. గరువారం నాటికి 1,34,72,643 మందికి టీకా వేసినట్లు ప్రకటించింది. గురువారం ఒక్కరోజే 8,01,480 మంది టీకా వేయించుకున్నారని తెలిపింది.

Kranthi

Kranthi

Next Story