ఉపఎన్నికలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి విజయం

Uttarakhand: చంపావత్ నియోజకవర్గం నుంచి ధామి గెలుపు

Rama Rao
Updated on: 4 Jun 2022 12:43 PM IST
Uttarakhand CM Pushkar Singh Dhami Wins Champawat Bypolls
X

 ఉపఎన్నికలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి విజయం

Uttarakhand: కీలకమైన ఉపఎన్నికలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి విజయం సాధించారు. దీంతో ఆయన తన సీఎం స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. చంపావత్ నియోజకవర్గం నుంచి ధామి గెలుపొందారు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పుష్కర్ సింగ్ థామి పరాజయం పాలయ్యారు. ఉప ఎన్నికలో 55వేల ఓట్లకుపైగా తేడాతో ప్రత్యర్థిపై ఆయన విజయం సాధించారు.

రికార్డు స్థాయిలో విజయాన్ని నమోదు చేసిన పుష్కర్ సింగ్ కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. నిజానికి ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పుష్కర్ సింగ్ పోటీ చేసి ఓడిపోయారు. అయినా ఆయనే సీఎం పీఠాన్ని అధిరోహించారు. కానీ రాజ్యాంగం ప్రకారం 6నెలల్లోగా ఏదైనా స్థానం నుంచి మళ్లీ అసెంబ్లీ సభ్యుడిగా గెలవాల్సి ఉంటుంది. దీంతో చంపావత్ స్థానం నుంచి పుష్కర్ సింగ్ ఉప ఎన్నికల్లో పోటీచేసి గెలిచారు.


Rama Rao

Rama Rao

Next Story