CM Dhami: మీకు చేరువలోనే ఉన్నాం.. సొరంగంలో చిక్కుకున్న కూలీలతో మాట్లాడిన సీఎం ధామి

CM Dhami: ఉత్తర కాశీలో స్కిల్‌యారా టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న కూలీలను కాపాడేందుకు ముమ్మర యత్నాలు సాగుతున్నాయి.

Shekhar G
Updated on: 23 Nov 2023 8:15 PM IST
Uttarakhand CM Dhami Talks To Labourers Trapped Inside Tunnel
X

CM Dhami: మీకు చేరువలోనే ఉన్నాం.. సొరంగంలో చిక్కుకున్న కూలీలతో మాట్లాడిన సీఎం ధామి

CM Dhami: ఉత్తర కాశీలో స్కిల్‌యారా టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న కూలీలను కాపాడేందుకు ముమ్మర యత్నాలు సాగుతున్నాయి. కొన్ని గంటల్లోనే 41మంది కూలీలను బయటికి తీసుకువచ్చే ఛాన్స్ ఉంది. వారికి తక్షణ వైద్యం అందించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అంబులెన్సులు, బెడ్స్, ఔషధాలు, ఆక్సిజన్ కిట్లు రెడీగా ఉంచారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అక్కడికి వెళ్లి సొరంగంలో చిక్కుకున్న కూలీలతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.

45 మీటర్ల వరకు మేము వచ్చామని.. మీకు అతి చేరువలోనే ఉన్నామని సీఎం చెప్పారు. గబ్బర్ సింగ్ నేగి, సబా అహ్మద్ అనే ఇద్దరు కూలీలతో మాట్లాడిన సీఎం వారి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైనంత త్వరగా అందరిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు అన్ని ఏజెన్సీలు పని చేస్తున్నాయని సీఎం చెప్పారు.

Shekhar G

Shekhar G

Next Story