ఉత్తరాఖండ్‌ సీఎంను మార్చుతున్నట్లు ప్రచారం

Arun Chilukuri
Published on: 8 March 2021 9:10 PM IST
ఉత్తరాఖండ్‌ సీఎంను మార్చుతున్నట్లు ప్రచారం
X

ఉత్తరాఖండ్‌ సీఎంను మార్చుతున్నట్లు ప్రచారం

ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర రావత్‌ను మార్చుతున్నట్లు సమాచారం. బీజేపీ హైకమాండ్‌ రావత్‌ను అర్జంట్‌గా ఢిల్లీకి పిలిపించింది. సీఎంను మారుస్తున్నారు కాబట్టే, ఈయన్ను అధిష్ఠానం పిలిపించిందన్న వార్తలు వచ్చాయి. అయితే వీటిని ఆయన వర్గీయులు ఖండించారు. ఆయన ఢిల్లీ వెళ్లింది నిజమే కాని...ముఖ్యమంత్రి మార్పుపై చర్చించేందుకు కాదని చెబుతున్నారు. హఠాత్తుగా ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో సీఎం తన అధికారిక కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలలో రావత్ నాయకత్వంపై తీవ్రమైన అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story