ఏపీ వ్యక్తికి కరోనా వస్తే.. వణికిన యూపీ.. 14 గ్రామాలు క్వారంటైన్‌లోకి !


ఆంధప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి వలన ఉత్తరప్రదేశ్ లో ఏకంగా 14 గ్రామాలు క్వారంటైన్‌లోకి వెళ్లాయి. ఏపీ చెందిన వ్యక్తికి కరోనా వైరస్ సోకడంతో ముందు...
ఆంధప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి వలన ఉత్తరప్రదేశ్ లో ఏకంగా 14 గ్రామాలు క్వారంటైన్‌లోకి వెళ్లాయి. ఏపీ చెందిన వ్యక్తికి కరోనా వైరస్ సోకడంతో ముందు జాగ్రత్తగా అధికారులు చుట్టు పక్కల గ్రామాలన్నింటినీ మూసివేశారు. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి యూపీలోని బడౌన్ జిల్లా భవానీపూర్ కాలీలోని ఓ ప్రార్థనా మందిరంలో ఉంటున్నాడు.
అతడు మార్చి నెలలో ఢిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లీఘీ జమాత్ సదస్సుకు హాజరయ్యాడు. దీంతో అతనిలో కరోనా లక్షణాలు కనిపించడంతో.. ఆ వ్యక్తిని గుర్తించిన అధికారులు అతనికి కరోనా పరీక్షలు నిర్వహించారు. శనివారం వచ్చిన రిపోర్టులో కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. అతడికి కరోనా సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో అతడు నివాసం ఉంటున్న 3 కిలో మీటర్ల పరిధిలో ఉన్న 14 గ్రామాలను మూసివేస్తున్నట్లు బడాన్ జిల్లా కలెక్టర్ కుమార్ ప్రశాంత్ ప్రకటించారు.
కాగా, ఉత్తర ప్రదేశ్ ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం.. ఇప్పటి వరకు 550 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారితో పోరాడి 47 మంది కోలుకున్నారు. ఐదుగురు ఈ మహమ్మారి బారినపడి చనిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా 498 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు వెల్లడించారు
REJOINDER
ఈ ఆర్టికల్ కు తొలుత ఉపయోగించిన ఇమేజిలో పొరపాటు దొర్లినది. ఇమేజి సెలక్ట్ చేసుకోవడంలో జరిగిన పొరపాటు ఇది. అనుకోకుండా జరిగిన పొరపాటుకు చింతిస్తున్నాము. ఆ ఆర్టికల్ నుంచి ఆ ఇమేజిలు తొలగించడం జరిగింది. ఇటువంటి పొరపాట్లు మరోసారి దొర్లకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అందరికీ తెలియచేసుకుంటున్నాము.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



