UPSC: యూపీఎస్సీ ఛైర్మన్‌ మనోజ్‌ సోని రాజీనామా

UPSC: వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు వెల్లడి

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 20 July 2024 5:19 PM IST
UPSC Chairman Manoj Soni resigns
X

UPSC: యూపీఎస్సీ ఛైర్మన్‌ మనోజ్‌ సోని రాజీనామా 

UPSC: యూపీఎస్సీ ఛైర్మన్‌ మనోజ్‌ సోని.. తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఐదేళ్లు పదవీకాలం ఉండగానే యూపీఎస్సీ ఛైర్మన్‌ పదవీకి మనోజ్‌ సోని అనూహ్యంగా రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రొబేషనరీ ఐఏఎస్‌ పూజా ఖేడ్కర్‌ వివాదం నేపథ్యంలో మనోజ్ సోనీ రాజీనామా చేయడం సంచలనం రేపుతోంది. పారదర్శకంగా పరీక్షను నిర్వహించడంలో యూపీఎస్సీ విఫలం అయిందనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. అందుకు బాధ్యత వహిస్తూ మనోజ్ సోని రాజీనామా చేశారనే ప్రచారం జరుగుతోంది. ఐతే ఆయన రాజీనామాను కేంద్రం ఇంకా ఆమోదించనట్టు సమాచారం.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story