UP Police: మాస్క్ లేదని చేతులు, కాళ్లలో మేకులు దింపిన యూపీ పోలీసులు

UP Police: మాస్క్ పెట్టుకోలేదని ఓ యువకుడి కాళ్ళలో, చేతుల్లో మేకులు పొడిచారు యూపీ పోలీసులు.

Kranthi
Published on: 27 May 2021 7:12 AM IST
Up Woman Alleges Cops Nailed Her Sons Limbs for not Wearing Mask
X

Up Woman Alleges Cops Nailed Her Sons Limbs:(File Image) 

UP Police: ఎదురు ప్రశ్నిస్తే కలెక్టర్ అంతటోడికే కోపం వచ్చి మొబైల్ నేలకేసి కొట్టి చెంప పగలగొట్టాడు. పోలీసులు, అధికారుల్లో కొంతమంది వారేదో నరకానికి రారాజులన్నట్లే వ్యవహరిస్తారు. తప్పు చేసినోళ్లందరినీ శిక్షించడానికే వారు పుట్టినట్లు బిల్డప్ ఇస్తారు. వారికి ఎదురు తిరిగారా.. వాళ్ల ప్రతాపమంతా చూపించేస్తారు. యూపీలోని బరేలీలో బరాదరీ ప్రాంతంలో ఓ ఘోరం జరిగింది. ఘోరాలు జరిగేది ఎప్పుడంటే పోలీసువాళ్లకు పైత్యం, ప్రకోపం రెండూ కలిసి పెరిగినప్పుడే. అక్కడ అదే జరిగింది.

ఒక యువకుడు మాస్క్ లేకుండా కనపడ్డాడు. ముగ్గురు పోలీసులు వచ్చి మాస్క్ ఎందుకు ధరించలేదని ప్రశ్నించారు. ఇంటి దగ్గరే ఉన్నాను కదా.. అంటూ ఏదో కొంచెం వాదించాడు. అంతే అతడిని తమతో పాటు తీసుకుపోయారు. ఇదంతా రాత్రిపూట జరిగింది. స్టేషన్ కు వెళ్లాక ఇంకెంత వాదన పెట్టుకున్నాడో తెలియదు గాని.. మరుసటి రోజు తెల్లవారుజామున తీవ్ర గాయాలతో, చేతికి, కాలికి మేకులతో దయనీయ స్ధితిలో కనిపించాడు. కరుణామయుడు సినిమాలో ఏసుకు చేతికి, కాళ్లకు మేకులు దింపినట్లే.. ఈ యువకుడిని చిత్రహింసలు పెట్టారు.

ఆ యువకుడి తల్లి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఆ పోలీసులు ఏమంటున్నారంటే.. అతఃడు మాస్కు పెట్టుకోలేదని కాదని.. అతడిపై పలు కేసులున్నాయని అంటున్నారు. స్వయంగా ఎస్పీ రోహిత్ సజ్వాన్ ఈ మాటలు చెప్పారు. కేసులుంటే మేకులు దింపాలని ఏదైనా సెక్షన్ లో రాసి ఉందా... అని అడిగితే.. విచారణ జరుపుతున్నామని సింపుల్ గా బదులిచ్చారు. అదీ సంగతి. మరి ఆ యువకుడికి న్యాయం జరుగుతుందో లేదో చూడాలి.

Kranthi

Kranthi

Next Story