LPG: జూన్ 30 వరకు ఉచితంగానే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్

LPG: ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర నిలకడగానే కొనసాగింది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.809 వద్ద ఉంది

Samba Siva Rao
Published on: 7 Jun 2021 1:27 PM IST
Up to 800 Cash Back on First LPG Gas Cylinder Booking in Paytm Till June 30
X

గ్యాస్ సిలిండర్ (ఫైల్ ఇమేజ్)

LPG: ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర నిలకడగానే కొనసాగింది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.809 వద్ద ఉంది. కోల్‌కతాలో సిలిండర్ ధర రూ.835 వద్ద కొనసాగుతోంది. జూన్ నెలలో 14.2 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. అయితే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ మాత్రం దిగొచ్చింది. ముంబైలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.809 వద్ద ఉంది. చెన్నైలో సిలిండర్ ధర రూ.825 వద్ద కొనసాగుతోంది. అయితే మీరు ఉచితంగానే సిలిండర్ పొందే ఛాన్స్ అందుబాటులో ఉంది.

ఇవాలెట్ సంస్థ పేటీఎం గ్యాస్ సిలిండర్ వాడే వారికి అదిరే ఆఫర్ అందుబాటులో ఉంచింది. భారీ తగ్గింపు ఆఫర్ అందిస్తోంది. ఏకంగా రూ.800 వరకు క్యాష్ బ్యాక్ ఇస్తోంది. అయితే పేటీఎం ద్వారా తొలిసారి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వారికే ఈ ఆఫర్ వర్తిస్తుంది. జూన్ 30 వరకు ఆఫర్ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.ప్రస్తుతం సిలిండర్ ధర రూ.809 వద్ద ఉంది. మీరు రూ.800 క్యాష్ బ్యాక్ పొందితే మీకు సిలిండర్ ఉచితంగా లభించినట్లు అవుతుంది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story