యూపీ సీఎం యోగి నామినేషన్‌.. తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా..

UP Election 2022: Yogi Adityanath File Nomination from Gorakhpur
x

యూపీ సీఎం యోగి నామినేషన్‌.. తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా..

Highlights

UP Election 2022: యూపీ ఎన్నికలు కాకరేపుతున్నాయి.

UP Election 2022: యూపీ ఎన్నికలు కాకరేపుతున్నాయి. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి, సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌ పూర్‌లో నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో కలిసి భారీ ర్యాలీలో పాల్గొన్నారు. గోరఖ్‌నాథ్‌ ఆలయంలో అమిత్‌షా, యోగి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ర్యాలీనుద్దేశించి అమిత్‌షా ప్రసంగించారు. మాఫియా నుంచి యూపీని యోగి విముక్తి కల్పించారని గర్వంగా చెప్పగలనని అమిత్‌ షా అన్నారు. 25 ఏళ్ల తరువాత న్యాయమైన పాలనను యోగి అందించినట్టు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు ఉచితంగా కరోనా టీకాలను పంపిణీ చేశారని అత్యధికంగా యూపీకే ఇచ్చారని అమిత్‌షా తెలిపారు.

సీఎం యోగి తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన అయోధ్య, మధుర అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారని తొలుత ప్రచారమైంది. అయితే యోగికి కంచుకోటైన గోరఖ్‌పూర్‌ నుంచే బరిలో దిగాలని బీజేపీ నిర్ణయించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories