Uttar Pradesh: యూపీ బీజేపీ ఇన్‌ఛార్జ్‌ రాధా మోహన్‌కు పాజిటివ్

Uttar Pradesh: సీఎం యోగి సహా పాల్గొన్న పలువురు బీజేపీ నాయకులు

Rama Rao
Published on: 11 Jan 2022 3:00 PM IST
UP BJP Incharge  Radha Mohan Singh Test Covid-19 Positive
X

 యూపీ బీజేపీ ఇన్‌ఛార్జ్‌ రాధా మోహన్‌కు పాజిటివ్

Uttar Pradesh: ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ యూపీ బీజేపీని కరోనా కంగారెత్తిస్తోంది. ఉత్తరప్రదేశ్ బీజేపీ ఇన్‌ఛార్జ్‌ రాధా మోహన్ సింగ్‌కు పాజిటివ్‌గా తేలింది. ఇదే సమయంలో రాధా మోహన్ హాజరైన సమావేశంలో పార్టీ పెద్దలంతా పాల్గొన్నారు. మీటింగ్‌లో పాల్గొన్న వారిలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, యూపీ బీజేపీ చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్ కూడా ఉడడం ఉత్తరప్రదేశ్ బీజేపీ నేతలను టెన్షన్ పెడుతోంది.

మరోవైపు రాధా మోహన్ సింగ్ సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో నిన్న రాత్రి పార్టీ నేతలంతా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాధా మోహన్‌ సింగ్ పక్కనే స్వతంత్ర దేవ్ సింగ్‌, ఆ పక్కనే సీఎం యోగి కూర్చొని కార్యాచరణపై చర్చించారు. ఇదంతా ఒకెత్తయితే ఈ రోజు స్వతంత్రదేవ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తుండటం మరింత టెన్షన్ పెడుతోంది. ఒకవేళ యూపీ బీజేపీ చీఫ్‌కు సైతం పాజిటివ్ వస్తే మరింత మందికి కోవిడ్ సోకే అవకాశం ఉంటుందని నెటిజన్లు మండిపడుతున్నారు.

Rama Rao

Rama Rao

Next Story