Vijay Kumar Singh: శరవేగంగా సొరంగ నిర్మాణపనులు

*జమ్మూకశ్మీర్‌ దోడాలో చేపట్టిన సొరంగ నిర్మాణ పనులు

Rama Rao
Published on: 1 Nov 2022 9:01 AM IST
Union Minister VK Singh inspected the tunnel construction work undertaken in Doda
X

Vijay Kumar Singh: శరవేగంగా సొరంగ నిర్మాణపనులు

Vijay Kumar Singh: జమ్మూకశ్మీర్‌ దోడాలో చేపట్టిన సొరంగ నిర్మాణ పనులను కేంద్ర మంత్రి వీకే సింగ్ పరిశీలించారు. జాతీయ రహదారిపై నిర్మిస్తున్న టన్నెల్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని మంత్రి తెలిపారు. అయితే మధ్య మధ్యలో కఠినమైన రాతి శిలలు అడ్డొస్తున్నందున నిర్మాణంలో కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉందని తెలిపారు. 1.574 కిలోమీటర్ల పొడవున నిర్మించే ఈ టన్నెల్ నిర్మాణ పనులను NHIDCL సంస్థ చేపట్టింది. వీలైనంత త్వరగా టన్నెల్ నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర మంత్రి వీకే సింగ్ తెలిపారు. టన్నెల్ నిర్మాణం పూర్తయితే జమ్మూ-కశ్మీర్‌ మధ్య రవాణా సదుపాయం చాలా సులభతరం అవుతుందని మంత్రి తెలిపారు.

Rama Rao

Rama Rao

Next Story