కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ కారు ప్రమాదం.. భార్య, పీఏ మృతి

Arun Chilukuri
Published on: 12 Jan 2021 6:42 AM IST
Union minister Shripad Naik injured in road accident in Karnataka
X

కర్ణాటకలో కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ కారు ప్రమాదానికి గురైంది. ఉత్తర కన్నడ జిల్లా అంకోలా సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో కేంద్ర మంత్రి శ్రీపాద్‌ నాయక్‌ భార్య విజయ, ఆయన పీఏ మృతి చెందారు. శ్రీపాద్ నాయక్ తీవ్రంగా గాయపడ్డారు. శ్రీపాద్ నాయక్‌ ప్రయాణిస్తున్న కారు కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా అంకుల సమీపంలో బోల్తాపడింది. ఎల్లాపూర్‌ నుంచి గోకర్ణ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు. మెరుగైన వైద్యం కోసం కేంద్రమంత్రిని గోవాలోని బంబోలి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స అందేలా చూడాలని గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ను ప్రధాని మోదీ కోరారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story