Union Minister Nitin Gadkari: మరో కేంద్ర మంత్రికి కరోనా

Union Minister Nitin Gadkari
Union Minister Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కరోనా బారినపడ్డారు. అనారోగ్యంతో వైద్యుడిని సంప్రదించి టెస్ట్ చేసుకోగా పాజిటివ్ అని తేలిందని నితిన్ గడ్కరీనే స్వయంగా ప్రకటించారు.
Union Minister Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కరోనా బారినపడ్డారు. అనారోగ్యంతో వైద్యుడిని సంప్రదించి టెస్ట్ చేసుకోగా పాజిటివ్ అని తేలిందని నితిన్ గడ్కరీనే స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ప్రస్తుతం తాను సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నట్లు ఆయన ప్రకటించారు
నీరసంగా అనిపించడంతో వైద్యుడిని సంప్రదించానని, ఈ క్రమంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలిందని తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు తెలిపారు. అలాగే ఇటీవలి కాలంలో తనను కలిసిన వారంతా జాగ్రత్తగా ఉండాలని తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో నితిన్ గడ్కరీ రాసుకొచ్చారు. ఇప్పటికే అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్, శ్రీపాద్ నాయక్ సహా పలువురు కేంద్రమంత్రులు ఈ మహమ్మారి బారినపడిన విషయం తెలిసిందే.