లోక్‌సభలో మహిళల వివాహ వయస్సు బిల్లు.. 75ఏళ్లు ఆలస్యంగా సమాన హక్కులన్న స్మృతి ఇరానీ

Union Min Smriti Irani Tables Bill To Raise Age Of Marriage For Women
x

లోక్‌సభలో మహిళల వివాహ వయస్సు బిల్లు.. 75ఏళ్లు ఆలస్యంగా సమాన హక్కులన్న స్మృతి ఇరానీ

Highlights

Smriti Irani: కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మహిళా వివాహ వయస్సు బిల్లును పార్లమెంట్ ముందు ప్రవేశపెట్టింది.

Smriti Irani: కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మహిళా వివాహ వయస్సు బిల్లును పార్లమెంట్ ముందు ప్రవేశపెట్టింది. వైవాహిక జీవితంలో అడుగుపెట్టే అంశంలో మహిళలు, పురుషులకు సమాన హక్కులు కల్పించేందుకు 75 ఏళ్లు పట్టిందన్నారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. ఈ సవరణ బిల్లు ద్వారా పురుషులు, మహిళలు 21 ఏళ్ల వయసుకు వచ్చినప్పుడు తమ వివాహంపై నిర్ణయం తీసుకోగలుగుతారని చెప్పారు. సమానత్వ హక్కు ప్రాతిపదికన ఈ బిల్లుకు సవరణ చేశామని వివరణ ఇచ్చారు.

అంతకుముందు మహిళా వివాహ వయస్సు బిల్లును కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష సభ్యులు నిరసనల మధ్యే బిల్లును ప్రవేశపెడుతున్నట్టు ఆమె ప్రకటించారు. అయితే విపక్ష సభ్యుల ఆందోళనలతో లోక్‌సభ రేపటికి వాయిదా పడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories