Union Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు?
ఈనెల 7న మధ్యాహ్నం 11 గంటలకు సమావేశం? 2024లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా కేబినెట్‌లో మార్పులు
నరేంద్ర మోడీ (ఫైల్ ఫోటో)
Union Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈనెల 7న మధ్యాహ్నం 11 గంటలకు ప్రధాని మోడీ ప్రభుత్వం కేబినెట్ విస్తరణ చేపట్టనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సమావేశంలో 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా మంత్రివర్గంలో మార్పులు జరుగనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర కేబినెట్‌లో గరిష్టంగా 81 మంది మంత్రులను స్థానం ఉండగా, ప్రస్తుతం 53 మంది మాత్రమే ఉన్నారు. దీంతో మరో 28 మందికి మంత్రులుగా అవకాశం లభించనుంది.
Next Story




