నేడు కేంద్ర కేబినెట్ భేటీ

Arun Chilukuri
Published on: 29 Oct 2020 11:18 AM IST
నేడు కేంద్ర కేబినెట్ భేటీ
X

నేడు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌ సమావేశం కానుంది. ఈ భేటీలో దేశంలో రెండోదశ కరోనా వైరస్ వ్యాప్తి, దేశ ఆర్ధిక వ్యవస్థలపై మంత్రివర్గం చర్చించనుంది. పలువురు కేంద్ర మంత్రులకు కరోనా రావడంతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మంత్రి మండలి భేటి కానుంది. భారత్‌లో అమెరికా మంత్రుల బృందం పర్యటిస్తున్న నేఫథ్యంలో అమెరికాతో చేసుకోవలిసిన పలు కీలక ఒప్పందాలపై కూడా ఈ భేటీలో చర్చించనున్నారు. అంతేకాకుండా ఎల్ఏసీ వద్ద యుద్ధానికి సిద్ధమంటూ డ్రాగన్ దేశం కవ్వింపులకు దిగుతుండడంపై.. చైనా దూకుడుపై తదుపరి కార్యాచరణపై దృష్టి సారించనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story