Union Budget 2021: పాత వాహనాలు చెత్తలోకే..

Arun Chilukuri
Published on: 1 Feb 2021 12:43 PM IST
Union Budget 2021: పాత వాహనాలు చెత్తలోకే..
X

పాత వాహనాలు చెత్తలోకే..

పాత వాహనాలతో పెరిగిపోతున్న కాలుష్యానికి, ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాత వాహనాలను స్క్రాప్ గా మార్చేందుకు కేంద్రం ప్లాన్ చేసింది. పాత వాహనాలను స్క్రాప్ గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది. దీనికి సంబంధించి బడ్జెట్ 2021 సమావేశాల్లో ఆర్థిక మంత్రి స్క్రాప్ పాలసీ ప్రస్తావించారు. దీంతో కాలం చెల్లిన వాహనాలను స్క్రాప్ కు ఇచ్చేలా పథకం రూపొందించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా వ్యక్తిగత వాహనాలైతే 25 ఏళ్లు, కమర్షియల్‌ వాహనాలు 15 ఏళ్లు దాటిన త‌ర్వాత‌ స్క్రాప్‌గా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. పాత వాహనాలను స్క్రాప్ కు అమ్ముకుంటే కొత్త వెహికల్ కొనుగోళ్లకు రాయితీ కలిగించేలా పథకం రూపొందించారు.

కాగా పొల్యూషన్ ప్రమాదాలను తగ్గించడం, ఎలక్ట్రికల్ వెహికల్స్ ను ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వెహికిల్ స్క్రాప్ పాలసీని తీసుకొచ్చింది. అయితే ఈ చర్య ద్వారా ఆటోమొబైల్ రంగానికి బూస్ట్ దక్కనుంది. అలాగే స్క్రాప్ కింద వచ్చే పాత వాహనాల తో ఆటోమొబైల్ సంస్థలు కొత్త వాహనాలను తయారుచేసే అవకాశం దక్కింది. ప్రస్తుతం మన దేశంలో 30 నుంచి 40 ఏళ్ల వరకు వాహనాలు నడుస్తున్నాయి. కొత్త పాలసీతో పాత వాహనాలకు చెత్తలోకి వెళ్లిపోతున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story