జమ్మూకశ్మీర్‌లో కూలిన నిర్మాణంలో ఉన్న టన్నెల్

*సొరంగంలో చిక్కుకున్న ఏడుగురు కూలీలు

Rama Rao
Published on: 20 May 2022 9:30 AM IST
Under Construction Tunnel Collapses in Jammu and Kashmir
X

జమ్మూకశ్మీర్‌లో కూలిన నిర్మాణంలో ఉన్న టన్నెల్

Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లోని రాంబన్‌ జిల్లాలో ప్రమాదం జరిగింది. రాంబన్‌ జిల్లాలోని ఖూనీ నాలా వద్ద జమ్ము- శ్రీనగర్‌ హైవేపై నిర్మిస్తున్న సొరంగ మార్గంలోని కొంతభాగం కూలిపోయింది. దీంతో ఏడుగురి ఆచూకీ లభించకుండా పోయింది. వారిని రక్షించడానికి స్థానిక పోలీసులు, సైనికులు సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే ఇప్పటికరకు సొరంగం మార్గం నుంచి ఒకరిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చామని రాంబన్‌ డిప్యూటీ కమిషనర్‌ తెలిపారు. ఇంకా ఆరుగురిని రక్షించడానికి ఆ ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతున్నదని చెప్పారు. సొరంగమార్గం కూలిపోవడంతో రెండు వైపులా ట్రాఫిక్‌ను నిలిపివేశామని వెల్లడించారు.

Rama Rao

Rama Rao

Next Story