Uddhav Thackeray: ప్రాణాలైనా వదులుతాం.. శివసేనను వదులుకోం..

Uddhav Thackeray: ప్రాణాలైనా వదులుతాం.. శివసేనను వదులుకోమని మరోసారి స్పష్టం చేశారు ఉద్ధవ్‌ థాక్రే.

Arun Chilukuri
Updated on: 24 Jun 2022 5:30 PM IST
Uddhav Thackeray Meeting with Shiv Sena District Leaders
X

Uddhav Thackeray: ప్రాణాలైనా వదులుతాం.. శివసేనను వదులుకోం..

Uddhav Thackeray: ప్రాణాలైనా వదులుతాం.. శివసేనను వదులుకోమని మరోసారి స్పష్టం చేశారు ఉద్ధవ్‌ థాక్రే. శివసేన జిల్లా నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఆయన శివసేనను ముక్కలు చేయాలని రెబల్‌ ఎమ్మెల్యేలు చూస్తున్నారని ఆరోపించారు. రెబల్స్‌కు ధైర్యం ఉంటే బాల్‌ థాక్రే, శివసేన పేరు లేకుండా జనంలోకి వెళ్లాలని సవాల్‌ విసిరారు. శివాజీ ఓడిపోయి ఉంటాడు కానీ జనం అతని వెంటే ఉన్నారని గుర్తుచేశారు. తనపై ఏక్‌నాథ్‌ షిండే ఆరోపణలు చేయడం సరికాదని, శివసేనను ఏక్‌నాథ్‌ షిండే బీజేపీలో కలిపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇద్దరున్నా తాను ప్రజల తరపునే పోరాడతానని గంటాపథంగా చెప్పారు ఉద్ధవ్‌.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story